దేవి శ్రీ ప్రసాద్ సెంచరీ కొట్టేశాడు.. అదే రాక్ స్టార్ 100వ సినిమా అని ఎవరు ఊహించలేదు!
రాక్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న దేవి శ్రీ ప్రసాద్ ఎలాంటి సినిమా చేసినా కూడా తన మ్యూజిక్ తోనే మంచి బజ్ క్రియేట్ చేస్తాడు. కెరీర్ మొదటి నుంచి కూడా తన మ్యూజిక్ తో మ్యాజిక్ క్రియేట్ చేయడం దేవికి వెన్నతో పెట్టిన విద్య. ఇక మొత్తానికి ఇటీవల రాక్ స్టార్ సెంచరీకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇక అతని 100వ సినిమా అని తెలియడానికి టైమ్ కూడా చాలానే పట్టింది.

ఆ వయసులోనే మొదటి సినిమా
దేవి శ్రీ ప్రసాద్ రైటర్ సత్యమూర్తి తనయుడు అని అందరికి తెలిసిన విషయమే. ఇక స్కూల్ దశ నుంచే మ్యూజిక్ ను నరనరాల్లో నింపేసుకున్న డిఎస్పీ మొదటి అవకాశాన్ని కూడా చాలా విచిత్రంగా అందుకున్నాడు. ఇంకా 20 ఏళ్ళ వయసులోకి కూడా రాలేదు. అప్పుడే కోడి రామకృష్ణ దర్శకత్వంలో దేవి సినిమాకు సాంగ్స్ కంపోజ్ చేయడమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంధించాడు.

ఎన్నో హిట్ ఆల్బమ్స్
దేవి సినిమా హిట్టవ్వడంతో అదే తన పేరుగా మార్చుకొని రెండు మూడేళ్లలో ఇండస్ట్రీలో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. తెలుగు తమిళ్ అని తేడా లేకుండా సౌత్ లో అన్ని రకాల సినిమాలు చేశాడు. ఆనందం, ఖడ్గం, వర్షం, ఆర్య, శంకర్ దాదా ఎంబీబీఎస్, జల్సా, అదుర్స్, 100% లవ్, గబ్బర్ సింగ్, మిర్చి, అత్తారింటికి దారేది, ఖైదీ నెంబర్ 150, డీజే, రంగస్థలం, ఉప్పెన అంటూ.. మర్చిపోలేని ఎన్నో హిట్ అల్బస్ అందించాడు.

అదే రాక్ స్టార్ 100వ సినిమా
ఇక ఈ 22 ఏళ్ళలో ఏనాడు కూడా దేవి పెద్దగా వివాదాల్లోకి వెళ్లలేదు. ఇక ఇటీవల సెంచరీ మార్క్ కూడా అందుకున్నాడు. దేవిశ్రీప్రసాద్ 100వ సినిమా ఖిలాడి అని ఎవరు ఊహించలేదు. రాక్ స్టార్ కూడా ఆ విషయాన్ని పట్టించుకోలేదట. సినిమా పాటలు మొత్తం రెడీ అయిన తరువాతనే విషయం తెలుసుకున్నారట.

ఫాస్ట్ గా రికార్డ్ అందుకున్న దేవి
రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడి సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతోనే దేవి శ్రీ ప్రసాద్ 100వ ఆల్బమ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గా రికార్డ్ అందుకున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశాడు.
సీనియర్ సంగీత దర్శకులు చాలామంది ఉన్నప్పటికీ దేవి శ్రీ ప్రసాద్ ఇంత ఫాస్ట్ గా రికార్డ్ అందుకున్నారు అంటే నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్లు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ పుష్పతో దేవి పాన్ ఇండియా మ్యూజిక్ ను మరింత డిఫరెంట్ గా ట్రై చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











