RRR: రామ్ చరణ్ - తారక్ కోసం కీరవాణి స్పెషల్ సాంగ్.. జక్కన్న నెక్స్ట్ టార్గెట్ అదే!
టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ RRR ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో గాని సినిమాపై వస్తున్న రూమర్స్ మాత్రం ఇప్పట్లో తగ్గేలా లేవు. గతంలో ఎప్పుడు లేని విధంగా కరోనా కారణంగా సినిమా వాయిదాల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక అక్టోబర్ 13కు సినిమా వస్తుందో లేదో తెలియదు గాని షూటింగ్ మాత్రం అనుకున్న సమయానికి పూర్తి చేయాలని రాజమౌళి చాలా కష్టపడుతున్నాడు.
ఇక సెకండ్ వేవ్ కాస్త తగ్గితే లాక్ డౌన్ అనంతరం ఒక షెడ్యూల్ ప్లాన్ సెట్ చేసుకున్నారట. సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి ఇప్పటికే అన్ని ట్యూన్స్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన సాంగ్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని సమాచారం. రామ్ చరణ్ - అలియా భట్ మధ్య కూడా ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుందట.

ఈ రెండు పాటలను నెక్స్ట్ షెడ్యూల్స్ లో ఫినిష్ చేయాలని టార్గెట్ అయితే సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మరికొన్ని సీన్స్ కూడా ఫినిష్ చేస్తే 40రోజుల్లో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుందట.
అప్పుడు హ్యాపీగా స్టూడియోలో కూర్చొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకోవచ్చు. ఇక ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో ఎలాగైనా ఒక మంచి సాంగ్ తో బజ్ మరింత పెంచాలని రాజమౌళి ఒక ప్లాన్ అయితే వేశాడు. మరి ఆ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











