Sarkaru Vaari Paata: థమన్ జోష్ మాములుగా లేదు.. ఫుల్ హ్యాపీ అంటూ మరో అప్డేట్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో టాలెంటెడ్ దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ అయితే పూర్తయింది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ విషయంలో కూడా స్పీడ్ పెంచేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమవుతున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. సంగీత దర్శకుడు తమన్ ఇటీవల కాలంలో కంపోజ్ చేస్తున్న ప్రతి పాట కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. ఇక సర్కారు వారి పాట సినిమాలోని విడుదలైన పాటలు కూడా మంచి క్రేజ్ అందుకోవడం విశేషం.
What a start for the day !! When Ur director is Super Happy !! 🎬🔥❤️🎛 #SarkaaruVaariPaataBgm Works On full swing 🧨 #SuperStarShining 😍
— thaman S (@MusicThaman) April 28, 2022
More updates ON THE WAY !! Big Bang On #May12 #SvpOnMay12th 🚀🚀🚀🚀🚀
Let’s make the Way for our dear #SuperStar @urstrulyMahesh gaaru ❤️ pic.twitter.com/oITFt3vlpU
కళావతి పాట ఇప్పటికే 150 మిలియన్ల వ్యూవ్స్ అందుకుంది. ఇక పెన్నీ సాంగ్ కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సర్కారు పాట టైటిల్ సాంగ్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమాకు సంబందించిన మరిన్ని అప్డేట్స్ ను త్వరలోనే అందించబోతున్నారు. సంగీత దర్శకుడు థమన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వివరణ ఇస్తున్నాడు. రీసెంట్ గా ఈ చిత్ర దర్శకుడు పరశురామ్ తో కలిసి ఒక ప్రత్యేకమైన ఫోటోను కూడా షేర్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈరోజు చాలా మంచి ఆరంభం అంటూ ఒక దర్శకుడు పనితనం ఇష్టపడితే అంత కంటే పెద్ద సంతోషం ఉండదు అని పేర్కొన్నాడు. అంతేకాకుండా సర్కారు వారి పాట బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఇక మరిన్ని అప్డేట్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయని ట్విట్టర్లో పేర్కొన్నాడు.
సర్కారు వారి పాట సినిమాను 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఒక రికవరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. సినిమాలో మంచి సందేశంతో పాటు అభిమానులు కోరుకునే యాక్షన్ ఎలిమెంట్స్ కూడా సమపాళ్ళలో ఉంటాయి అని దర్శకుడు పరశురామ్ ఇదివరకే వివరణ ఇచ్చాడు. ముఖ్యంగా కొన్ని ఎపిసోడ్స్ ను మహేష్ బాబు అభిమానులు చొక్కాలు చించుకునే విధంగా ఎంజాయ్ చేస్తారు అని చాలా నమ్మకంతో తెలియజేశాడు.

ఇక ఈ సినిమా ద్వారా మహానటి కీర్తిసురేష్ మొదటిసారి మహేష్ బాబుతో కలిసి నటించింది. వీరిద్దరి కలయికలో వచ్చే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని తెలియజేస్తున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు కూడా సినిమాలో చాలా హైలెట్గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని సమాచారం. ఇక ఈ సినిమా అనంతరం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమాను మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











