Just In
- 2 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 3 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 5 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
మాజీ రాష్ట్రపతి కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీర కన్నుమూత
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గదిలోకి రమ్మన్న రంగసానులు.. సై సై అనేసిన ధనరాజ్.. తలుపు తీయమంటూ అలీ! వీడియో వైరల్
రంగసానుల గదిలో రచ్చ చేసేందుకు రెడీ అయ్యారు మన తెలుగు కమెడియన్స్. ధనరాజ్, అలీ ఇద్దరూ రంగసానుల గదిలోకి వెళ్లేందుకు సై సై అంటున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తోంది. ఇంతకీ అసలు సంగతేంటి? రంగసానుల గదిలోకి ధనరాజ్, అలీ నిజంగానే వెళ్ళారా? వెళితే ఏం జరిగింది? ఆ వివరాలు చూద్దామా..

పెరుగుతున్న డిమాండ్.. అందరి చూపు అటువైపే
ఆధునికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో ఐటెం పాటలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. థియేటర్‌కి వెళ్లిన ప్రతీ ఒక్కరి చూపు ఐటెం సాంగ్, అందులో వేసే చిందులపైనే పడుతోంది. అందుకే ఈ మధ్య వచ్చే సినిమాల్లో ఐటెం పాటను ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. అదే బాటలో డైరెక్టర్, నటుడు ఓంకార్ తన టాలెంట్‌కి మరింత పదును పెట్టాడు.

గతంలో కంటే భిన్నంగా.. అదిరిపోయే స్టెప్స్
తాను చేస్తున్న తాజా సినిమా ‘రాజుగారి గది 3' కోసం ప్రత్యకంగా ఓ ఐటెం సాంగ్ షూట్ చేశారు. ఈ సాంగ్ వీడియోను రిలీజ్ చేసి తన సినిమాతో భయపెట్టడమే కాదు మాస్ మసాలా కూడా అందిస్తానని చెప్పకనే చెప్పేశాడు. పైగా ఈ మాస్ మసాలా ఐటెం వీడియోలో రంగసానుల గదిలోకి వెళ్లేందుకు కమెడియన్స్ ధనరాజ్, అలీ కుతూహలాన్ని చూపించి మరింత రక్తి కట్టించాడు.

సుందరాంగుల పిలుపు.. ధనరాజ్, అలీ రియాక్షన్
‘రాజుగారి గది 3' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘నా గదిలోకి రా' అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ విడుదల చేశాడు ఓంకార్. ఇద్దరు సుందరాంగులు అందంగా స్టెప్పులేస్తూ నా గదిలోకి రా అని పిలుస్తుండటం దానికి ధనరాజ్, అలీ రియాక్ట్ కావడం హైలైట్ గా నిలుస్తోంది. ఇక ఆ ఇద్దరు సుందరాంగులతో ఓంకార్ వేసిన డాన్స్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.

నా గదిలోకి రా.. రసిక ప్రియులను రంజింప జేస్తూ
నా గదిలోకి రా అంటూ సాగిపోతున్న ఈ సాంగ్‌కి శ్రీమణి సాహిత్యం అందించగా.. ఎం.ఎం.మానసి, శ్రీవర్థిని, తనుశ్రీ నటరాజన్, మిరయ వర్మ, రేవంత్, షబీర్ ఊపుతెప్పించేలా ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట రసిక ప్రియులను రంజింప జేస్తోంది.
హారర్ నేపథ్యంలో సినిమాలు.. అందులో భాగంగా
డిఫెరెంట్ జానర్‌లో హారర్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో 'రాజుగారి గది' సిరీస్ మొదలు పెట్టాడు ఓంకార్. ఆయన చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ కావడంతో ఇప్పటికే ఈ సిరీస్ నుండి రెండు భాగాలు రిలీజ్ చేసి భేష్ అనిపించుకున్నారు. ఇక అదే బాటలో మూడో భాగం 'రాజుగారి గది 3' ని కూడా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు రెడీ అయ్యాడు.

'రాజుగారి గది 3' విడుదల తేదీ
ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజుగారి గది 3' చిత్రంలో 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ ఫేం అవికా గోర్, ఓంకార్, అశ్విన్ బాబు లీడ్ రోల్స్ పోషించారు. అలీ, ధన్‌రాజ్, అజయ్ ఘోష్, ఊర్వశి, ప్రభాస్ శ్రీను, హరితేజ ముఖ్యపాత్రలు పోషించారు. షబీర్ సంగీతం సమకూర్చారు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. అక్టోబర్ 18న ఈ సినిమా విడుదల కానుంది.