For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Tuck Song: సర్‌ప్రైజ్ చేసిన ‘టక్ జగదీష్’ డైరెక్టర్.. నాని ప్లాన్‌తో కథ అడ్డం తిరిగిందిగా!

  |

  కొంత కాలంగా సరైన హిట్ కోసం వేచి చూస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ క్రమంలోనే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ 'జెర్సీ' రేంజ్‌లో సక్సెస్‌ను మాత్రం అందుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాని నటించిన చిత్రం 'టక్ జగదీష్'. ప్రేమకథలతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు తెరకెక్కించే దర్శకుడు శివ నిర్వాణ దీన్ని రూపొందించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. అనివార్య కారణాలతో ప్రేక్షకుల ముందుకు మాత్రం రాలేదు. దీన్ని గత సమ్మర్‌లోనే విడుదల ప్లాన్ చేసినా.. సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు.

  Evaru Meelo Koteeswarulu షోకు షాకింగ్ రేటింగ్: చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. దానితో పోలిస్తే మాత్రం!

  'టక్ జగదీష్' మూవీని థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించినా.. అందుకు పరిస్థితులు అనుకూలించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేయబోతున్నారు. వినాయక చవితి కానుకగా ఈ సినిమాను సెప్టెంబర్ 10 స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ వీడియో రికార్డు స్థాయిలో వ్యూస్, లైకులు సంపాదించింది. దీంతో పలు రికార్డులు బద్దలయ్యాయి.

  Nanis Tuck Jagadish Movie Tuck Song Released

  'టక్ జగదీష్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌ను వదిలిన చిత్ర బృందం.. ఇప్పుడు 'టక్ థీమ్ సాంగ్'ను కూడా విడుదల చేసింది. హీరో క్యారెక్టర్‌ను వివరిస్తూ సాగే ఈ పాటను దర్శకుడు శివ నిర్వాణ రచించడంతో పాటు అద్భుతంగా ఆలపించాడు. ఇక, ఈ సాంగ్‌ను గోపీ సుందర్ కంపోజ్ చేశాడు. ఎంతో సరదాగా సాగిపోయే ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది కొద్ది సమయంలోనే వైరల్ అయింది.

  అనసూయకు నెలలు అంటూ అభి సంచలన వ్యాఖ్యలు: ప్రెగ్నెన్సీపై అందరి ముందే ఊహించని ఆన్సర్

  మొదట ఈ పాటను నేచురల్ స్టార్ నానితో పాడించాలని దర్శకుడు శివ నిర్వాణ అనుకున్నాడు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్‌తో చెబుతాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నానిని ఒప్పించాలని ప్లాన్ చేసుకుని అతడి దగ్గరకు వెళ్తారు. ఆ సమయంలో పాటను ఎలా పాడాలి అన్న విషయాన్ని శివ నిర్వాణ అతడికి వివరిస్తాడు. అన్నీ విన్న తర్వాత నాని 'ఇలాగే పాడాలా? ఇదే యాసతో పాడాలా? ఇంకెందుకు ఆలస్యం నువ్వే పాడేయ్' అని అంటాడు. అందుకు అనుగుణంగానే ఈ సాంగ్‌ను శివ నిర్వాణ ఆలపించాడు. ఇందులో లిరిక్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

  ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'టక్ జగదీష్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. నాజర్, జగపతిబాబు, రావు రమేశ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను చేస్తున్నారు.

  English summary
  Natural Star Nani, Ritu Varma and Aishwarya Rajesh Doing Tuck Jagadish Movie Under Shiva Nirvana Direction. Now This Movie Tuck Song Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X