రొమాంటిక్ డోస్: మరింత రెచ్చిపోయిన హీరోహీరోయిన్లు.. అన్ని సీన్లు హైలైటే

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మాణంలో ఆయన కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రొమాంటిక్'. కొడుకును ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కించి స్టార్ హీరోని చేయాలని తాపత్రయ పడుతున్న పూరి.. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను అనిల్ పాదూరి చేతిలో పెట్టి అన్ని బాధ్యతలను దగ్గరుండి చూసుకున్నారు. ఈ సినిమాలో ఆకాష్ పూరి సరసన అందాల భామ కేతికశర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ వైపు సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు రొమాంటిక్ అప్‌డేట్స్ ఇస్తూ రసిక ప్రియులను రంజింపజేస్తోంది చిత్రయూనిట్. ఈ మేరకు తాజాగా చిత్రంలోని 'నువ్వు నేను ఈ క్షణం' సాంగ్ వీడియో విడుదల చేశారు. ఈ సాంగ్‌లో చూపించిన సన్నివేశాల్లో హీరోహీరోయిన్లు రెచ్చిపోయారు. అన్ని సీన్లు హైలైట్ గానే ఉన్నాయి.

Nuvvu Nenu E Kshanam song from Romantic Movie

ఈ పాటను స్వయంగా పూరి జగన్నాథ్ రాయడం విశేషం. ఈ సాంగ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని సాంగ్ చూసిన జనం. అలా విడుదలైందో లేదో ఇలా వైరల్ అయిన ఈ సాంగ్ ప్రస్తుతం యు ట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉంది. మాఫియా నేపథ్యంలో ఓ రొమాంటిక్ ప్రేమ కథగా ఈ సినిమా రూపొందుతోంది. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X