Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పిల్లా పర్ఫెక్ట్ పిక్చర్.. కాజల్ సెక్సీ లుక్.. ఊపేస్తున్న రణరంగం సాంగ్
దశాబ్ద కాలంగా వెండితెరపై హవా సాగిస్తోంది పంజాబీ భామ కాజల్ అగర్వాల్. భాషాబేధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్న ఈ సీనియర్ భామ ఇప్పటికే హాఫ్ సెంచరీ దాటేసి మంచి జోష్‌లో ఉంది. నేటి అప్‌కమింగ్ హీరోయిన్లను మించిన అందంతో క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతూనే ఉంది. ఇటీవలే 'సీత' రూపంలో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ మరికొద్ది రోజుల్లో 'రణరంగం' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆగస్టు 15 వ తేదీన 'రణరంగం' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా చిత్రంలోని ''పిల్లా పర్ఫెక్ట్ పిక్చర్'' అనే వీడియో సాంగ్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్‌లో కాజల్ హంగామా మామూలుగా లేదు. బీచ్ ఒడ్డున ఓ హోటల్‌లో సెక్సీ లుక్‌తో హుషారెత్తించే స్టెప్పులేసింది కాజల్. ఈ సాంగ్ చూస్తుంటే థియేటర్స్ ఈలలతో గోల పెట్టేయడం ఖాయం అనిపిస్తోంది. ఈ సాంగ్‌కి కృష్ణ చైతన్య లిరిక్స్ అందించగా, నిఖితా గాంధీ ఆలపించారు. తాజాగా విడుదలైన సాంగ్‌ని బట్టి చూస్తే.. 'సీత'లో పవర్ ఫుల్ లేడీ పాత్ర పోషించిన కాజల్, ప్రెసెంట్ మూవీ 'రణరంగం'లో ఫుల్లీ గ్లామరస్ పాత్రలో నటించిందని తెలుస్తోంది.

సుధీర్ వర్మ దర్శకతంలో తెరకెక్కుతున్న 'రణరంగం' సినిమాలో శర్వానంద్ హీరోగా నటించగా.. ఆయన సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. గ్యాంగ్‌స్టర్ కథాంశంతో యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా ఈ చిత్రం రూపొందించబడుతోంది. కాకపోతే ఈ చిత్రంలో కాజల్ మాత్రం గ్లామర్ డోస్ మరింత పెంచిందని సమాచారం. ఆగస్టు 15 వ తేదీన 'రణరంగం' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు తమిళంలో ఆమె నటించిన మరో సినిమా 'కోమలి' కూడా అదే రోజు విడుదల కానుంది. అంటే ఒకేసారి కాజల్ అగర్వాల్ డబుల్ ట్రీట్ ఇవ్వనుందన్నమాట.