Degala Babji lyrical video: బండ్ల గణేష్ కూతురు ద్రిష్టి చేతుల మీదుగా.. కలలే కన్నానే.. కలగా మిగిలేనే పాట
ఒక వ్యక్తి, ఒకే ప్రదేశంలో, ఒకే లొకేషన్లో, ఒక్క వ్యక్తి మాత్రమే సినిమా అంతా కనిపిస్తాడు. తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్‌తో చేసిన సినిమా ఇది. ఇంకా ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నా. అయితే, వాళ్ల వాయిస్ మాత్రమే వినిపిస్తుంది తప్ప మనుషులు కనిపించరు. తమిళ్ లో నేషనల్ అవార్డ్ పొందిన "ఉత్త సిరుప్పు సైజు 7" చిత్రాన్ని తెలుగులో. ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ తీసున్న చిత్రమే 'డేగల బాబ్జీ'. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ... రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రాన్ని.
త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేసిన ట్రైలర్ సైతం ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ చిత్రం లోని లిరికల్ వీడియోను బండ్ల గణేష్ కూతురు ద్రిష్టి విడుదల చేసారు.
దర్శకుడు వెంకట్ చందర్ గారు మాట్లాడుతూ ..ఈ సినిమాను ఓటిటిటీలో చూసి తీసుకోవడం జరిగింది. ఆ సినిమా తీసుకున్న తర్వాత ఎవరి నీతో చేయాలి అనుకున్న టైంలో నాకు 20 సంవత్సరాలు ఫ్రెండ్ గా ఉన్న బండ్ల గణేష్ గారు గుర్తొచ్చారు. తన గురించి నాకు బాగా తెలుసు తను ఎమోషనల్గా ఎలా ఉంటాడు అనేది నాకు పర్సనల్ గా తెలుసు. ఈ సినిమాకు కావలసిన ఎమోషన్ తనలో ఉందని తెలిసి తనతో ఈ సినిమా చేస్తున్నాను. బండ్ల గణేష్ అనే వ్యక్తి ఏ రేంజ్ పర్సన్,ఎలా యాక్ట్ చేశాడు అనేది సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతారు. లైనస్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.త్వరలో వస్తున్న ఈ సినిమాకు మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను అన్నారు.
సంగీత దర్శకుడు లైనస్ మధిరి మాట్లాడుతూ.. ఇలాంటి మంచి చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ఈరోజు రాబోతున్న ఈ సాంగ్ ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.ఇందులో బండ్ల గణేష్ చాలా విలక్షణమైన నటనతో అద్భుతమైనటువంటి నటనను కనపరిచాడు.మేం చేసిన కష్టానికి ప్రేక్షకులు మంచి ఫలితాలను ఇవ్వాలని కోరుతున్నాను.

దర్శకత్వం: వెంకట్ చంద్ర
నిర్మాత: స్వాతి చంద్ర
ఆర్ట్: గాంధీ
కూర్పు: ఎస్.బి. ఉద్దవ్
సినిమాటోగ్రఫి: అరుణ్ దేవినేని
కథ: ఆర్. పార్తిబన్
మాటలు: మరుధూరి రాజా, వైదేహి
సంగీతం: లైనస్ మధిరి
సమర్పణ: రిషి అగస్త్య
నిర్మాణ సంస్థ: యష్ రిషి ఫిలిమ్స్
పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)


Click it and Unblock the Notifications











