రాస్కో సాంబా ఈ పాట మామూలుగా ట్రెండ్ అవదు.. రామ్‌జో ట్వీట్ వైరల్

రామ జోగయ్య శాస్త్రి అంటే ఎన్నో పాటలు స్మృతిలోకి వస్తాయి. సదాశివ సన్యాసి అనే పాటతో తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసిన రామ జోగయ్య శాస్త్రి.. తాజాగా బుట్టబొమ్మ పాటతో అందర్నీ తన బుట్టలో వేసుకున్నారు. తమన్, రామ జోగయ్య శాస్త్రి కాంబోలో వచ్చిన అన్ని పాటలు దాదాపుగా బ్లాక్ బస్టర్ హిట్టే అయ్యాయి. అయితే మరోసారి ఈ ద్వయం కలిసికట్టుగా రాబోతోంది.

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తోన్న పింక్ రీమేక్ చిత్రానికి తమన్, రామజోగయ్య శాస్త్రి కలిశారు. వీరితో పాటు సామజవరగమన అంటూ తెలుగు రాష్ట్రాలను తన గాత్రంతో ఊపేసిన సిద్ శ్రీరామ్ కూడా తోడయ్యాడు. ఇక ఈ పాట ఇంకే రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోండి. ఇదే విషయాన్ని తమన్ సోషల్ మీడియాలో చెబుతూ.. మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్టు పేర్కొన్నాడు.

Ramajogayya Sastry About Pink Remake Sid Sriram Song

ఈ క్రమంలోనే ఓ పిక్‌ను కూడా షేర్ చేశాడు. ఎంతో కూల్‌గా ఉన్న సిద్ శ్రీరామ్, తమన్‌.. ఈసారి మరో సెన్సేషన్‌తో రాబోతోన్నట్టు తెలుస్తోంది. పవన్ కోసం కంపోజ్ చేసే ఈ పాట ట్రెండ్ అవ్వాల్సిందేనంటూ నెటిజన్లు కోరుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే రామ జోగయ్య శాస్త్రి రిప్లై ఇస్తూ.. రాస్కో సాంబా ఈ పాట మామూలుగా ట్రెండ్ అవదు అని పేర్కొన్నాడు. మరి ఈ పాట ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X