Just In
Don't Miss!
- Sports
గబ్బా హీరో రిషభ్ పంత్.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.!
- Finance
కంపెనీలు ఆ నిర్ణయం తీసుకుంటే.. వచ్చే అయిదేళ్లలో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 15%
- News
Inside info:జగన్ -షా మీటింగ్‌లో ఏం జరిగింది.. మళ్లీ ఢిల్లీకి సీఎం: ఏపీలో కీలక పరిణామాలు
- Lifestyle
బాదం చట్నీతో బోలెడన్నీ లాభాలు... దీన్ని ఈ సమయంలోనే ఎక్కువగా తినాలట...!
- Automobiles
2030 నాటికి భారత్‌లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘సోలో బ్రతుకే సో బెటర్’ టైటిల్ సాంగ్ రిలీజ్: వాళ్లకు అంకితమిచ్చిన సాయి ధరమ్ తేజ్
వరుస పరాజయాలతో బాధ పడుతోన్న సమయంలో 'చిత్రలహరి'తో డీసెంట్ హిట్ అందుకుని, గత ఏడాది వచ్చిన 'ప్రతిరోజూ పండగే'తో కెరీర్‌లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఆ మూవీ ఇచ్చిన జోష్‌లో ఉన్న అతడు ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమా చేస్తున్నాడు. నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన ఈ మూవీలో నభా నటేష్ హీరోయిన్‌గా చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
షూటింగ్ పూర్తయినప్పటికీ లాక్‌డౌన్ కారణంగా 'సోలో బ్రతుకే సో బెటర్' రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న దీన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి సమయం దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ 'బోలో బోలో బ్యాచ్‌లర్.. సోలో బ్రతుకే సో బెటర్' అనే పాటను తాజాగా విడుదల చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటకు ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చాడు.

ఈ పాటను తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసిన హీరో సాయి ధరమ్ తేజ్.. 'సాటి సోలో సోదరసోదరియమణులకు విరాట్ చెప్పేది ఏంటంటే...Solo Brathuke So Better.. మన సింగిల్స్ అందరికి అంకితం' అంటూ రాసుకొచ్చాడు. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఈ సినిమాలోని కొన్ని పాటలు విడుదల అయ్యాయి. వాటన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడీ టైటిల్ సాంగ్‌కు కూడా అదే రీతిలో రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన లిరిక్స్ యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే, థమన్ సంగీతం కూడా బాగుంది.
సాటి సోలో సోదరసోదరియమణులకు విరాట్ చెప్పేది ఏంటంటే...Solo Brathuke So Better !!!https://t.co/7xdXVdcyUF
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 11, 2020
మన సింగిల్స్ అందరికి అంకితం !!!#SBSBTitleSong is live now. #SoloBrathukeSoBetter@NabhaNatesh @MusicThaman @subbucinema @SVCCofficial @BvsnP @SonyMusicSouth @ZeeStudios_