ఫోన్‌లు పగలగొట్టండి అంటూ రెచ్చిపోయిన మంగ్లీ.. మంత్రి ఇంట అలా.. అసలు ఏమైందంటే?

యాంకర్ గా కెరీర్ ప్రారంభించి యాంకర్ గానే కాకుండా సింగర్ గా నటిగా కూడా ఎంతగానో క్రేజ్ అందుకున్న మంగ్లీ ఇప్పుడు అనూహ్యంగా వివాదంలో చిక్కుకుంది. ఆమె తన అభిమానుల మీద ఫైర్ అవుతున్నట్టు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఏమైంది ? మంగ్లీ ఎందుకు వివాదంలో చిక్కుకుంది ? అనే వివరాల్లోకి వెళితే..

తీన్మార్ వార్తలతో

తీన్మార్ వార్తలతో

ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన సింగర్ మంగ్లీ ఒక న్యూస్ ఛానల్ లో వచ్చిన తీన్మార్ వార్తలతో మొదట మంచి క్రేజ్ అందుకుని ఆ తర్వాత సింగర్ గా యూ టర్న్ తీసుకుని అతి తక్కువ కాలంలోనే తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులను గెలుచుకుంది. నిజానికి ఆమె ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా సరే అసలు ఏ మాత్రం తేడా లేకుండా తెలంగాణ యాసలో మాట్లాడుతూ మంచి ఫేమ్ తెచ్చుకుంది.

 మంచి హిట్స్

మంచి హిట్స్

యాంకర్ గా నిలదొక్కుకున్నాక ఆమె సింగర్ గా కూడా ప్రయత్నాలు చేసింది. అలా ఆమె సఫలం అవడంతో ఆమె పాడిన పాటలు యూ ట్యూబ్ లో ఏ స్థాయిలో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రేలారే అంటూ తెలంగాణకు సంబంధించిన సాంగ్స్ తో క్రేజ్ అందుకొని అనంతరం సినిమాల్లో కూడా పాడే స్థాయికి ఎదిగింది. ఆమె అల వైకుంఠపురములో.. రాములో రాములో ఫిమేల్ సింగర్ గా క్లిక్ అయిన విషయం తెలిసిందే. ఇవి కాకుండానే తెలుగు రాష్ట్రాల పండుగలు అయిన శివరాత్రి, బోనాల, దసరా లాంటి పండుగలకు ప్రతి ఏటా ప్రత్యేక పాటలు రూపొందించి విడుదల చేసి మంచి హిట్స్ సంపాదిస్తోంది. . ఆ సాంగ్స్‌ రిలీజ్ చేసిన ప్రతి సారీ కోట్లాది వ్యూస్ సంపాదిస్తూ వచ్చాయి.

మంత్రి కుమార్తె రిసెప్షన్ వేడుకలో

మంత్రి కుమార్తె రిసెప్షన్ వేడుకలో

అయితే తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె రిసెప్షన్ వేడుకలో సింగర్ మంగ్లీ హాజరయి అలరించింది. అయితే అక్కడే సింగర్‌ మంగ్లీకి సెల్ఫీల సెగ తగిలింది. మంత్రి కుమార్తె పెళ్లి రెసెప్షన్‌కు వచ్చిన మంగ్లీతో సెల్పీలు దిగేందుకు కొందరు యువకులు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఒక్క సారిగా ఫోటోల కోసం ఫ్యాన్స్‌ హంగామా చేయడంతో తట్టుకోలేక అటూ ఇటూ పరుగులు పెట్టింది మంగ్లీ.

అభిమానుల నుండి తప్పించుకొని

అభిమానుల నుండి తప్పించుకొని

కార్యక్రమం పూర్తైన అనంతరం తన కారులో వెళ్లేందుకు సింగర్ మంగ్లీ స్టేజి దగ్గర నుండి తన కారు వద్దకు చేరుకుంటున్న క్రమంలో అభిమానులు సెల్ఫీ దిగేందుకు వచ్చారు. ఒక్కసారిగా మీదకి వస్తున్న క్రమంలో మంగ్లీ వారి నుంచి తప్పించుకునేందుకు ఇబ్బంది పడినట్లు వైరల్ అయినా వీడియో ద్వారా తెలుస్తుంది. చివరకు అభిమానుల నుండి తప్పించుకొని కారు ఎక్కి వెళ్లారు.

Recommended Video

Nithiin Vinayaka Chavithi Special Interview | Maestro Movie
 ఫోన్‌లు పగలగొట్టు అంటూ

ఫోన్‌లు పగలగొట్టు అంటూ

ఈలోపే సింగర్ మంగ్లీ ఫోన్‌లు పగలగొట్టు అంటూ తన స్టాఫ్‌కు చెబుతూ చిందులు తొక్కినట్టు కనిపిస్తోంది. అంతే కాక తన అసిస్టెంట్‌ను కూడా మంగ్లీ కొట్టినట్టు కనిపిస్తోంది. బండికి ఫోన్ చెయ్ రా దరిద్రుడా అంటూ అరిచినట్టు వినిపిస్తోంది. మొత్తానికి మంగ్లీ ఇలా ప్రవర్తించి, వివాదంలో చిక్కుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X