Don't Miss!
- News
కుప్పంలో ఓడిపోతాం - ఇదీ కారణం : లోకేష్ కు కార్యకర్త షాక్..!!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Finance
Modi Vs Manmohan: భారత ఆర్థికాన్ని ఎవరు బాగా హ్యాండిల్ చేశారు..? ప్రజలు మెచ్చింది అతడినే..
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్పై వెటరన్ కామెంట్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
మరో పవర్ఫుల్ క్యారెక్టర్ తో రాబోతున్న సింగర్ రఘు కుంచె.. ఈసారి అంతకుమించి అంటున్నాడు!
టాలీవుడ్ సీనియర్ మోస్ట్ సింగర్స్ లో ఒకరైన రఘు కంచె అంటే తెలియని వారు ఉండరు. మాస్ సాంగ్స్ లవ్ సాంగ్స్ అంటూ రెండు తరాల వారిని ఎంటర్టైన్ చేశాడు. నెక్కిలెసు గొలుసు సాంగ్ ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే యాక్టర్ గా కూడా అప్పుడప్పుడు ఆయన సరికొత్తగా ఆకట్టుకుంటున్నారు. గతంలో పలాస 1978 సినిమాతో ఎట్రాక్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు మరొక సినిమాతో రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఈ విధంగా వివరణ ఇచ్చారు. లీడ్ యాక్టర్ గా మరొక ఇంట్రెస్టింగ్ మూవీకి సైన్ చేశాను. వివరాలు చెబుతామని అంటే మా డైరెక్టర్ గారు అనుమతి ఇవ్వలేదు. షూటింగ్ మొదలై రెండు రోజులు అయ్యింది. అమేజింగ్ సబ్జెక్టు. నేనైతే చాలా ఆసక్తితో ఉన్నాను. ఈ న్యూ ప్రాజెక్ట్ గురించి షేర్ చేయడానికి విషయం అలాంటిది మరి.

అలాగే మొన్న పూజతో మొదలైన మూవీ ఆగస్ట్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సాంగ్స్ పని కూడా మొదలైంది. పగలు షూట్ - నైట్ రికార్డింగ్స్. రెండు పడవల ప్రయాణం. సూక్తికి విరుద్ధంగా పర్ఫెక్ట్ గా పని చేయాలి అంటే ప్రయత్నం గట్టిగా చేస్తున్నా.. అని రఘు కుంచె వివరణ ఇచ్చారు. అలాగే ఏకె 47 పట్టుకున్న స్టిల్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆ స్టిల్ వైరల్ అవుతోంది. మరి ఈ సినిమాతో రఘు నటుడిగా ఏ స్థాయికి చేరుకుంటాడో చూడాలి. కేవలం నటుడిగానే కాకుండా మరికొన్ని బయట సినిమాలకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు.