twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ ఫ్యాన్స్‌ కోరిక నెరవేరింది.. ఎట్టకేలకు ఆ పాట వచ్చేసింది

    |

    అల వైకుంఠపురములో సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ ఓ కోరిక కలిగే ఉంటుంది. సామజవరగమన, రాములో రాములో, బుట్టబొమ్మ వంటి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన సాంగ్స్‌ను పెద్ద స్క్రీన్స్‌లో చూశారు. బన్నీ స్టెప్పులు, పూజా అందాలను అందరూ ఆస్వాధించారు. అయితే సినిమా నుంచి బయటకు వచ్చాక ప్రతీ ఒక్కరి మదిలో ఆ ఆశ పుట్టే ఉంటుంది. అదే సిత్తరాల సిరపడు పాట. క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాట కంపోజింగ్, బన్నీ యాక్షన్, స్టైలీష్ స్టెప్పులు, యాటిట్యూడ్ ఇలా ప్రతీ ఒక్కటి అందర్నీ కట్టిపడేసి ఉంటాయి.

    సెన్సేషన్‌గా మారిన ఆల్బమ్..

    సెన్సేషన్‌గా మారిన ఆల్బమ్..

    మామూలుగా అయితే సినిమాలోని ఏదో ఒక పాట మాత్రమే సెన్సేషనల్‌గా మారుతూ ఉంటుంది. ఆ ఒక్క పాటే జనం నోళ్లలో నానుతూ ఉంటుంది. కానీ ఆల్బమ్ మొత్తం సూపర్ డూపర్ హిట్ అవ్వడం అన్నది ఈ మధ్య కాలంలో చాలా అరుదుగా జరుగుతోంది. అయితే అల వైకుంఠపురములో ఆల్బమ్ గురించి తెలియన తెలుగు ప్రజలు, సినీ ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు.

    వంద మిలియన్ల పాటలు..

    వంద మిలియన్ల పాటలు..

    తెలుగులో వంద మిలియన్ల వ్యూస్ సాధించిన పాటలు ఉంటాయా? వస్తాయా? అని అనుకునేవారు. అయితే ఒకే సినిమాలోని రెండు పాటలు వంద మిలియన్ల వ్యూస్‌ను సాధించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వంద మిలియన్ల వ్యూస్ ఒకెత్తు అయితే వన్ మిలియన్ లైకులు మరో ఎత్తు.

    స్పెషల్‌గా నిలిచిన సిత్తరాల సిరపడు..

    శ్రీకాకుళం యాసలో అక్కడి జానపదాలతో రచించిన ఈ పాట విశేషంగా ఆకట్టుకుంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ ఈ పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించే కోరిక పుట్టే అవకాశం ఉంది. అందుకే చాలా మంది సోషల్ మీడియాలో ఈ పాటను తొందరగా రిలీజ్ చేయండని చిత్ర యూనిట్‌కు రిక్వెస్ట్‌లు పెట్టారు. ఇక బన్నీ ఫ్యాన్స్‌కు అయితే ఈ పాట తెగ నచ్చేసి ఉంటుంది. ఈ పాటలో బన్నీ కనిపించిన విధానం, స్టైల్, యాటిట్యూడ్, గ్రేస్‌తో కూడిన స్టెప్పులు ఇలా విజువల్ ట్రీట్‌గా అనిపించి ఉండొచ్చు.

    Recommended Video

    భార్య స్నేహారెడ్డితో అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాలు..!! వీడియో వైరల్
    విడుదలైన సిత్తరాల సిరపడు..

    విడుదలైన సిత్తరాల సిరపడు..

    సినీ, సంగీత ప్రియుల కోరిక మేరకు ఈ పాటను తాజాగా విడుదల చేశారు. శ్రీకాకుళం యాసలో సాగే ఈ పాటను విజయ్ కుమార్ రచించగా.. సాకేత్ కొమందురి, సూరన్న ఆలపించారు. ఈ పాటకు యాక్షన్ సీన్స్ కంపోజ్ చేసిన రామ్ లక్ష్మణ్ మాష్టర్లను త్రివిక్రమ్ పొగిడిన సంగతి తెలిసిందే.

    English summary
    Sitthara Sirapadi Song Is Released From Alavaikunthapurramuloo. Music Is Composed By Thaman And Movie Is Relaesed On 12th January.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X