Don't Miss!
- News
తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే: తాజా హెల్త్ బులిటెన్
- Sports
పాపం సర్ఫరాజ్‌ఖాన్.. సెలెక్టర్ల బాక్స్ బద్దలు కొట్టినా ఎంపికవ్వలేదు: రవిచంద్రన్ అశ్విన్
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
బాలయ్య కోసం రియల్ గా బాక్సులు బద్దలు కొట్టిన థమన్.. ఊరమాస్ అంతే.. చేతులెత్తేసిన యాజమాన్యాలు!
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ దెబ్బతో ఎక్కడ చూసినా బాలకృష్ణ అభిమానులతో థియేటర్లు నిండిపోయాయి. సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల సందడితో ఈ రోజు అంతా అఖండ నామస్మరణ తో మునిగిపోయింది. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన థమన్ దెబ్బకు సౌండ్ బాక్సులు బద్దలు అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే

అమెరికాలో కూడా
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా దూసుకుపోతోంది. ప్రీమియర్స్ మరియు మార్నింగ్ షోల నుండి మంచి టాక్ కూడా ఈ సినిమా అందుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రచ్చ కేవలం తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం కాకుండా అమెరికాలో కూడా ఉంది.

ఏమాత్రం సందేహం లేదు
USA థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలా మారిపోయాయి. అమెరికాలో థియేటర్ల వద్ద బాలయ్య కటౌట్స్ వద్ద అభిమానులు కొబ్బరికాయలు పగలగొట్టారు. అఖండలో, బాలయ్య అదరకొట్టే పెర్ఫార్మెన్స్‌తో పాటు, బోయపాటి విజువలైజేషన్‌కు థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. అయితే ఎస్ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అఖండ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

నోటీసులు
థమన్ అందించిన అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కారణంగా అమెరికా సౌండ్ బాక్సులు బద్దలు అయ్యాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన థియేటర్స్ చైన్ సినిమార్క్ తమ థియేటర్స్ లో సౌండ్ తగ్గిస్తున్నామని, అన్ని సినిమాల కోసం వారు ప్లే చేసే సౌండ్ కంటే తక్కువగా నిర్దిష్ట డెసిబెల్‌స్ లో ప్లే చేయబడుతుందని నోటీసులు ఉంచింది.

ఆ సమస్య రాకుండా
స్పీకర్‌లు దెబ్బతినకుండా నిరోధించడానికి ఇది ఒక నివారణ చర్య అని తెలుస్తోంది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అఖండ యొక్క ఫుల్ సౌండ్ ను మేము ఫీల్ అవ్వాలి అంటూ ఒక థియేటర్ లో అభిమానులు కోరినట్టు వాల్యూమ్‌ని పెంచగా బాక్సులు బద్దలు అయ్యాయి. దీంతో మిగతా చోట్ల ఆ సమస్య రాకుండా ఈ నోటీసులు జారీ చేసింది సినిమార్క్.

అగ్నిప్రమాదం
మరో పక్క అఖండ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాద ఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది. అఖండ సినిమా ప్రదర్శిస్తున్న జెమిని థియేటర్ లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ప్రేక్షకులు సినిమా చూస్తుండగా.. ఒక్కసారిగా థియేటర్ లో పొగలు అలుముకోవడం తో భయాందోళనకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు.
Recommended Video

హాట్ టాపిక్ గా
ఇక నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ సినిమా కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. పరిస్థితులు మళ్ళీ అదుపులోకి వస్తున్న నేపథ్యంలో బాలయ్య తాజా సినిమా అఖండ డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. అఖండ సినిమా రిలీజ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామునుంచే సందడి మొదలైంది. మొత్తం మీద బాక్సులు బద్దలు అయిన అంశం హాట్ టాపిక్ గా మారింది.