Don't Miss!
- News
Sajjala : కోటంరెడ్డి టీడీపీలోకే ? తేల్చేసిన సజ్జల- ఫోన్ ట్యాపింగ్ పై కీలక వ్యాఖ్యలు !
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
వీరసింహారెడ్డి నుంచి స్పెషల్ ట్రీట్.. చుట్టూ అమ్మాయిలతో బాలయ్య క్రేజీగా!
గత ఏడాది 'అఖండ' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ జోష్‌లోనే ఆయన ఫ్యూచర్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా లైన్‌లో పెట్టుకుంటోన్నారు. ఇలా ఇప్పటికే టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహారెడ్డి' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
స్పోర్ట్స్ బ్రాతో అనుష్క ఓవర్ డోస్ షో: షార్ట్ కూడా పైకి లేపేసి మరీ!
క్రేజీ కాంబోలో పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'వీరసింహారెడ్డి' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఈ ఏడాది ఆరంభంలోనే మొదలైంది. అప్పటి నుంచి ఇది శరవేగంగా సాగుతోంది. ఇలా ఇప్పటికే దాదాపు టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను సంక్రాంతికి రెడీ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య మూవీ నుంచి మూడో సాంగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ తాజాగా వదిలింది.

'వీరసింహారెడ్డి' మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్‌ను ఇప్పటికే మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఈ మూవీ నుంచి రెండు పాటలను కూడా విడుదల చేసింది. ఈ క్రమంలోనే దీని నుంచి స్పెషల్ నెంబర్ 'మా బావ మనోభావాలు' అనే సాంగ్‌ను డిసెంబర్ 24వ తేదీన మధ్యాహ్నం 3:19 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ వదిలింది. ఇందులో బాలయ్య చైర్‌లో స్టైల్‌గా కూర్చుని ఉండగా.. చుట్టూ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. దీంతో ఈ పాటపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
బీచ్‌లో యాంకర్ హరితేజ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో తొలిసారి అరాచకంగా!
బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇది జనవరి 12వ తేదీన రాబోతుంది.