twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పరిస్థితి దిగజారిపోయింది, మాకు విలువ లేదు: సంగీత దర్శకుడు కోటి ఆవేదన

    |

    Recommended Video

    'No One Is Giving Respect To The Music Directors' Says Vintage Music Director Koti

    ఒకప్పటితో పోలిస్తే మ్యూజిక్ డైరెక్టర్లకు ఇపుడు ఇండస్ట్రీలో గౌరవం తగ్గిపోయిందని, దర్శక నిర్మాతలు కూడా ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కంపోజర్లకు ఇవ్వడం లేదని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి వ్యాఖ్యానించారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ఈ యంగ్ జనరేషన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది, మా రోజుల్లోనే పరిస్థితి చాలా బావుండేదని తెలిపారు.

    ఇపుడు పరిస్థితి ఎలా తయారైందంటే.. ఎవరు తక్కువ బడ్జెట్లో మ్యూజిక్ కొడితే వారికే ఇచ్చేస్తున్నారు. సినిమా రంగంలో మ్యూజిక్ అనేది ఇపుడు చాలా క్రిందకు దిగజారిపోయిందని కోటి చెప్పుకొచ్చారు. దాని వల్ల ఎవరికీ వ్యాల్యూ లేకుండా పోయింది. ఏ కంపోజర్ అయినా మూడు లేదా నాలుగు సినిమాలకు మించి ఇండస్ట్రీలో ఉండటం లేదు, ఆ తర్వాత కనబడకుండా పోతున్నారని తెలిపారు.

    చాలా అన్యాయం జరుగుతోంది

    చాలా అన్యాయం జరుగుతోంది

    ఈ మధ్య సింగర్లకు కూడా చాలా అన్యాయం జరుగుతోంది. పెద్ద సినిమాలకు పాడినా తక్కువ రెమ్యూనరేషనే ఇస్తున్నారు. మా రోజుల్లో పరిస్థితి ఇలా ఉండేది కాదు. సింగర్లకు, లిరిక్ రైటర్లకు ఒక వ్యాల్యూ ఉండేది. మ్యూజిషియన్లకు, కంపోజర్లకు ఒక వ్యాల్యూ ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని కోటి చెప్పుకొచ్చారు.

    అక్కడ మరీ నీచంగా ఉంది

    అక్కడ మరీ నీచంగా ఉంది

    ఇపుడు స్టూడియోలు కూడా చిన్న కంప్యూటర్ బేస్డ్ స్టూడియోలు వచ్చేశాయి. గంటకు రూ. 150కే ఇస్తున్నారు. కొందరైతే రూ. 75కే ఇస్తామని వచ్చేస్తున్నారు. అలాంటపుడు క్వాలిటీ ఎక్కడ ఉంటుంది? ఇది కేవలం తెలుగులో కాదు తమిళం, కన్నడలో కూడా అలాగే ఉంది. మలయాళం అయితే ఇంకా నీచంగా ఉంది. దొడ్లో కూడా స్టూడియో పెట్టేస్తున్నారని కోటి తెలిపారు.

    ఇది స్పీడ్ యుగం

    ఇది స్పీడ్ యుగం

    ఒకప్పుడు వాయిస్ కోసం ప్రత్యేకంగా రూమ్ అనేది ఉండేది. ఇపుడు అవన్నీ లేవు. కంప్యూటర్లో వాయిస్ రకరకాలుగా మార్చేస్తున్నారు. ఇలా చేయడాన్ని నేను విమర్శించడం లేదు. కాలం అలా వెళుతోంది. ఇదంతా స్పీడ్ యుగం. మున్ముందు పెను మార్పులు వస్తాయన్నారు.

    మా వర్కింగ్ ప్యాటర్న్, డెడికేషన్, ఇన్వాల్వ్మెంట్ వేరు

    మా వర్కింగ్ ప్యాటర్న్, డెడికేషన్, ఇన్వాల్వ్మెంట్ వేరు

    ఇపుడు సినిమా హిట్ అయిందా? లేదా? అనేదే ముఖ్యం. మా రోజుల్లో కూడా హిట్టవ్వడం ముఖ్యమే కానీ... మా వర్కింగ్ ప్యాటర్న్, డెడికేషన్, ఇన్వాల్వ్మెంట్ వేరు. ఇపుడు ఎవడు పడితే వాడు నోటీకొచ్చింది రాయడం, ఇష్టానికి తీయడం, జనాలు పాప్ కార్న్ తింటూ చూడటం అపిపోయింది... సినిమా అంటేనే అలా తయారైంది.... అని కోటి చెప్పుకొచ్చారు.

    English summary
    "No one is giving respect to the music directors. Their condition has worsened." Veteran Music director Koti about Present Music composers Situation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X