Don't Miss!
- News
ఢిల్లీ లిక్కర్ స్కాం : ఈడీ రెండో ఛార్జిషీట్లో కేజ్రివాల్ పేరు- అంతా ఫిక్షన్ అన్న ఢిల్లీ సీఎం..
- Lifestyle
హలో లేడీస్, మీలో ఈ లక్షణాలున్నాయా? హార్మోన్ సమస్యే కావొచ్చు, ఈ చిట్కాలు మీకోసమే
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Sports
India vs Australia అహ్మదాబాద్ టెస్ట్‌కు భారత ప్రధాని
- Finance
Income Tax: ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పన్ను విధానం మేలు.. అలా జంపింగ్ కుదరదా..?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Waltair Veerayya: చిరంజీవి ‘సెంచరీ’ రికార్డు.. టాలీవుడ్‌లోనే ఏకైక హీరోగా ఘనత
రాజకీయాల కోసం గ్యాప్ వచ్చినా.. రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఫలితాలను పట్టించుకోకుండా ప్రాజెక్టులు చేస్తోన్న ఆయన.. ఈ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంలో నటించారు. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ కూడా నటించాడు. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన ఈ మూవీ ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు మంచి టాక్‌తో పాటు రివ్యూలూ పాజిటివ్‌గానే వచ్చాయి.
Shraddha Das: లోదుస్తులు లేకుండా శ్రద్దా దాస్ రచ్చ.. బాబోయ్ ఇలా తెగించిందేంటి!
చిరంజీవి - రవితేజ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి మొదటి రోజు నుంచీ టాక్‌తో సంబంధం లేకుండానే స్పందన మాత్రం భారీ స్థాయిలో వచ్చింది. ఫస్ట్ అండ్ సెకెండ్ షోలు కూడా హౌస్ ఫుల్ బోర్డులతో కనిపించాయి. దీంతో ఈ చిత్రానికి చిరంజీవి కెరీర్‌లోనే మంచి ఓపెనింగ్స్ దక్కాయి. అంతేకాదు, మూడు రోజుల్లోనే ఈ మూవీ వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోయింది. అలాగే, ఆరు రోజులూ భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా పూర్తి చేసుకుంది. దీంతో చిరంజీవి సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను కూడా బ్రేక్ చేసేసింది.

ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన 'వాల్తేరు వీరయ్య' మూవీ.. తాజాగా మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆల్బమ్ యూట్యూబ్‌లో వంద మిలియన్లకు పైగా వ్యూస్‌ను రాబట్టింది. తద్వారా చాలా తక్కువ సమయంలోనే ఈ ఘనతను సాధించిన చిత్రంగా ఇది రికార్డు సాధించింది. అలాగే, సీనియర్ హీరోల్లో ఈ మార్కునే చేరిన ఏకైక స్టార్‌గా చిరంజీవి నిలిచారు. ఇదిలా ఉండగా.. ఇందులోని బాస్ పార్టీ సాంగ్ అత్యధికంగా 52 మిలియన్లు, శ్రీదేవి సాంగ్ 13 మిలియన్లు, నీకేమో అందమెక్కువ సాంగ్ 8.3 మిలియన్లు, టైటిల్ సాంగ్ 9.5 మిలియన్లు, పూనకాలు లోడింగ్ 20 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టాయి.
తెలుగు పిల్ల డింపుల్ అందాల జాతర: ఎద భాగం కనిపించేలా ఏకంగా ఫ్లైట్‌లోనే!
మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన మాస్ మూవీనే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా నటించారు.