twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Lata Mangeshkar పెళ్లి ఎందుకు చేసుకోలేదు? బ్రహ్మచారిణిగా ఎందుకు ఉండిపోయింది?

    |

    భారత నైటింగల్, భారత రత్న పురస్కార గ్రహీత, దిగ్గజ గాయని లతా మంగేష్కర్ మరణించారనే వార్తతో యావత్ సినీ ప్రపంచం మూగబోయింది. ఏడు దశాబ్దాలకుపైగా ఎన్నో వేల గీతాలతో ప్రేక్షకులను మైమరిపించారనే వార్త అభిమానులను, సినీ వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే ఆమె అవివాహితగానే మిగిలిపోవడం వెనుక కారణాలేమిటనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆ వివాహం చేసుకోకుండా ఉండటానికి ప్రధాన కారణాలు ఏమిటంటే..

    Recommended Video

    Lata Mangeshkar జ్ఞాపకార్థం సంతాప దినాలు.. గాన కోకిల లతా మంగేష్కర్‌ | Oneindia Telugu
    13వ ఏటనే తండ్రి మరణంతో

    13వ ఏటనే తండ్రి మరణంతో

    లతా మంగేష్కర్ విషయానికి వస్తే.. 1929లో సెప్టెంబర్ 28వ తేదీన దీనానాథ్ మంగేష్కర్ దంపతులకు జన్మించారు. అయితే తన 13వ ఏటనే తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ బాధ్యతను ఆమె భుజాన పడింది. కుటుంబంలో పెద్ద దిక్కు లేకపోవడంతో సోదరుడు హృదయనాథ్, అక్క మీనా, చెల్లెల్లు ఆషా, ఉషా మంగేష్కర్ పెంపకాన్ని తానే స్వీకరించింది. కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూ అన్నీ తానై అయ్యారు.

    కుటుంబ బాధ్యతలన్నీ తనపైనే..

    కుటుంబ బాధ్యతలన్నీ తనపైనే..

    తండ్రి లేకపోవడంతో ఆర్థిక బాధ్యతలు లతపై పడటంతో 13వ ఏటనే గాయనిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తన సోదరుడు, ముగ్గురు సిస్టర్స్‌ను మ్యూజిక్ రంగంలో స్థిరపడేలా చేసింది. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. ఆషా, ఉషా, మీనా , హృదయనాథ్ పెళ్లిళ్లు, వారి జీవితాలను ఓ గాడిలో పెట్టే ప్రయాణంలో తన గురించి పెద్ద ఆలోచించలేకపోయారని పలువురు చెప్పుకొంటారు.

    భూపేన్ హాజరికాతో అఫైర్?

    భూపేన్ హాజరికాతో అఫైర్?


    అయితే ఓ దశలో ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు భూపేన్ హజారికాతో అఫైర్ ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ వారిద్దరి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, వారి మధ్య అలాంటి విషయాలు ఉన్నట్టు కనిపించకపోవడంతో రూమర్లుగానే మిగిలిపోయాయి. మీడియా కూడా పెద్దగా వారి అఫైర్ గురించి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో అంతటితోనే ఆ వార్తలకు బ్రేకులు పడ్డాయి.

    భూపన్ హాజరికా భార్య ఏం చెప్పిందంటే?

    భూపన్ హాజరికా భార్య ఏం చెప్పిందంటే?

    అయితే భూపేన్ హాజరికాతో అఫైర్ వ్యవహారం 2012లో మరోసారి తెరపైకి వచ్చింది. భూపేన్ హజారికా మరణం తర్వాత ఆయన మాజీ భార్య ప్రియంవద పటేల్ హజారికా మీడియాలో స్పందించడం చర్చనీయాంశమైంది. భూపేన్‌తో లతాకు అఫైర్ ఉందనే విషయాన్ని ఆమె నిర్ధారించారు. అలా వారి మధ్య అఫైర్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

    పెళ్లికి దూరంగా ఎందుకంటే?

    పెళ్లికి దూరంగా ఎందుకంటే?


    లతా మంగేష్కర్ విషయానికి వస్తే.. తొలుత కుటుంబ బాధ్యతలు, ఆ తర్వాత కెరీర్ కారణంగా లైఫ్‌లో ఊపిరి సలపనంతగా బిజీగా మారిపోయారు. జీవితంలో కొన్ని చేదు అనుభవాలు పెళ్లివైపు దృష్టి పడనీయకుండా చేశాయనే విషయాన్ని ఆమె సన్నిహితులు చెప్పుకొంటారు. అలా లతా మంగేష్కర్ జీవితాంతం బ్రహ్మాచారిణిగా, అవివాహితగా మిగిలిపోయారు. తన జీవితాన్ని సంగీతానికి అంకితం చేసి.. సూర్యుడు అస్తమించని సంగీత సమ్రాజ్యానికి మహారాణిగా మారిపోయారు.

    లతా మంగేష్కర్ మరణం ఇలా..

    లతా మంగేష్కర్ మరణం ఇలా..

    ఇదిలా ఉండగా, తన 92వ ఏట లతా మంగేష్కర్ మరణించారు. ఆమె గతనెల కోవిడ్ పాజిటివ్ కారణంగా బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేరారు. శనివారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అని వైద్యులు ప్రకటన చేశారు. కానీ పలు అవయవాలు పనిచేయకపోవడంతో ఆదివారం ఉదయం 8.12 గంటల ప్రాంతంలో మరణించారు అని వైద్యులు ప్రకటించారు. దాంతో సినీ సామ్రాజ్యం మూగబోయింది.

    English summary
    Legendary singer Lata Mangeshkar never got married in her entire life. But rumours in the media said that, She had affair with Bhupen Hazarika.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X