»   » మహేష్ బాబు ‘బైక్’ గెలుచుకునే సూపర్ ఛాన్స్!

మహేష్ బాబు ‘బైక్’ గెలుచుకునే సూపర్ ఛాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన '1-నేనొక్కడినే' చిత్రం ఈ నెల 10న గ్రాండ్‌గా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈచిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు టీవీ, పేపర్, రేడియో, ఇంటర్నెట్ తదితర మాధ్యమాల్లో మార్మోగి పోతున్నాయి. సినిమా మొదటి వారంలో భారీగా ఓపెనింగ్స్ రాబట్టేందుకు వీలైనన్ని దారులు వెతుకుతున్నారు నిర్మాతలు.

 1-Nenokkadine – Win the Superstar Bike Contest

ఇందులో భాగంగా సినిమాలో మహేష్ బాబు ఉపయోగించిన బైక్ గెలుచుకునేందుకు సరికొత్త కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను మొదటి వారంలో చూసిన ప్రేక్షకులకు మాత్రమే ఈ ఛాన్స్ దక్కనుంది. ఈ మేరకు నిర్మాతలు కాంటెస్టుకు సంబంధించిన వివరాలు ప్రకటించారు. సినిమా విడుదలైన మొదటి వారంలో సినిమా చూసిన వారు 'ONE' అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 'మీ టికెట్ నెంబర్' టైప్ చేసి 58888 అనే నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపితే....బైక్ గెలుచుకునే ఆ లక్కీ విన్నర్ మీరే కావొచ్చు.

సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోన్న మహేష్ బాబు '1-నేనొక్కడినే' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. U/A సర్టిఫికెట్ జారీ కావడం ద్వారా ఈచిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడొచ్చని స్పష్టమవుతోంది.

ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం. ఈచిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది.

English summary
Here is a chance for superstar fans to win the Bike of Superstar Mahesh Babu used in 1-Nenokkadine. All you need to do is watch '1-Nenokkadine' movie in theatres in the 1st week and SMS ‘ONE’ <space> Your Ticket Number to 58888.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu