»   » 1 నేనొక్కడినే, ఎవడు... థర్డ్ వీకెండ్ కలెక్షన్స్

1 నేనొక్కడినే, ఎవడు... థర్డ్ వీకెండ్ కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంక్రాంతి పండగను పురస్కరించుకుని విడుదలైన '1 నేనొక్కడినే', 'ఎవడు' చిత్రాలు మూడు వారాంతాలు పూర్తి చేసుకున్నాయి. మహేష్ బాబు నటించిన సైకలాజికల్ థ్రిల్లర్, రామ్ చరణ్ తేజ్ నటించిన యాక్షన్ డ్రామా చిత్రాలు రెండు గ్లోబల్ బక్సాఫీసు వద్ద భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన '1 నేనొక్కినే' చిత్రం జనవరి 10వ తేదీన రికార్డు స్థాయిలో అత్యధిక థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజు ఈచిత్రం మంచి బిజినెస్ చేసినప్పటికీ నెగెటివ్ మౌత్ టాక్ రావడంతో క్రమక్రమంగా బాక్సాఫీసు వద్ద బిజినెస్ తగ్గుముఖం పట్టింది.

1: Nenokkadine, Yevadu 3rd Weekend Collection At Box Office

తొలి 17 రోజుల్లో '1 నేనొక్కడినే' చిత్రం ఆంధ్రప్రదేశ్ బక్సాఫీసు వద్ద రూ. 22 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.50 కోట్లు, ఓవర్సీస్‌లో 8 కోట్లు వసూలు చేసింది. టోటల్‌గా ఈచిత్రం వరల్డ్ వైడ్‌గా తొలి మూడు వారాంతాలు గడిచే నాటికి రూ. 33.50 కోట్లు వసూలు చేసింది.

ఇక 'ఎవడు' చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదలై రామ్ చరణ్ నటించిన సినిమాల్లో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సినిమాకు తొలి రోజు నుండే పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లు రాబట్టింది. తొలి 15 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 42 కోట్లు వసూలు చేసింది. '1 నేనొక్కినే' చిత్రం బిజినెస్ రెండో వారంలోనే తగ్గుముఖం పట్టగా...ఎవడు చిత్రం కలెక్షన్లు మూడో వారంలోనూ బాగున్నాయి.

ఈ నెల 31న నితిన్ నటించిన 'హార్ట్ ఎటాక్', మోహన్ బాబు ఫ్యామిలీ మల్టీ స్టారర్ 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రాలు విడుదలవుతున్న నేపథ్యంలో '1 నేనొక్కడినే', 'ఎవడు' చిత్రాల కలెక్షన్లపై ప్రభావం పడుతుందని టాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

English summary
Two-much hyped Telugu movies 1: Nenokkadine and Yevadu, which released during Sankranthi festival, have continued to keep the bells ringing at the worldwide Box Office in the third week. Having done good collection in the third weekend, Mahesh Babu's psychological thriller and Ram Charan Teja's action drama are fast heading to achieve Rs 50 crore mark in the global market.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu