»   »  ఆగిపోయిన పవన్ ..10 సినిమాలు లిస్ట్ (పొస్టర్స్ తో )

ఆగిపోయిన పవన్ ..10 సినిమాలు లిస్ట్ (పొస్టర్స్ తో )

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... తన సినిమాల కలెక్షన్స్ తో 84 సంవత్సరాల తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో రికార్డ్ లు క్రియేట్ చేసారు. అలాగే...ఆగిపోయిన ప్రాజెక్టుల విషయంలోనూ ఆయనే రికార్డ్ క్రియేట్ చేసారు. ఆ రికార్డ్ వింటే ఆశ్చర్యపోతారు.

కొన్ని స్క్రిప్టు దశలో, మరికొన్ని షూటింగ్ దశలో, మరికొన్ని పొస్ట్ ప్రొడక్షన్ దశలో ఇలా వేర్వేరు దశల్లో ఈ చిత్రాలు ఆగిపోయాయి. ఈ జనరేషన్ లో మరే హీరోకు ఇన్ని ప్రాజెక్టులు ఆగిపోవటం లేదేమో అనిపిస్తుంది.

Also Read: గోచీలో రవితేజ... అండర్ వేర్లో పవన్, చిరు, బాలయ్య, నాగ్ (ఫోటోస్)

అయితే ఇలా వివిధ దశల్లో ఆగిపోవటానికి కారణం..పవన్ పెరఫెక్షన్ కోసం పరితపించటం అని చెప్తూంటారు. ఓ రకంగా ఆగిపోయిన ఈ చిత్రాల్లో కొన్ని బయిట జనాలకు అసలు తెలియదు. సరదాగా వీటిపై ఓ లుక్కేయద్దాం. వీటిల్లో కొన్ని అఫీషియల్ గా ఖరారు కానివి. మాటలు దశలోనే ఆగిపోయినవి.

పవన్..ఆగిపోయిన సినిమాలు స్లైడ్ షోలో

చెప్పాలని ఉంది

చెప్పాలని ఉంది

పవన్ ,అమీషా పటేల్ తో ప్లాన్ చేసిన ఈ సినిమా తర్వాత కాలంలో తరుణ్, రిచాలతో నువ్వే కావాలి సినిమాగా వచ్చి పెద్ద హిట్టైంది.

సత్యాగ్రహి

సత్యాగ్రహి


జాని తర్వాత పవన్ డైరక్ట్ చేద్దామనుకున్న చిత్రం ఇది. లాంచ్ అయ్యింది కానీ..పలు కారణాలతో ఆగిపోయింది.

దేశి

దేశి


పవన్ కళ్యాణ్ హీరోగా దేశభక్తి ప్రేరిత చిత్రంగా రూపొందిన స్క్రిప్టుతో మొదలుకావాల్సిన ఈ చిత్రం మొదలు కాకుండానే ఆగిపోయింది.

జీసస్ క్రైస్ట్

జీసస్ క్రైస్ట్

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కొండా కృష్ణం రాజు నిర్మాతగ ఈ చిత్రం జెరూసలేంలో ఎనౌన్స్ చేసారు. కానీ మెటీరియలైజ్ కాలేదు.

కోబలి

కోబలి

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కతుందని ప్రకటించారు. ఇప్పటివరకూ ఈ సినిమా విషయమై మళ్లి న్యూస్ లేదు.

లారెన్స్ దర్శకత్వంలో

లారెన్స్ దర్శకత్వంలో

అప్పట్లో లారెన్స్ ఓ పవర్ ఫుల్ కథతో పవన్ తో చిత్రం చేస్తున్నానని స్వయంగా ప్రకటించారు. కానీ తర్వాత అప్ డేట్ లేదు.

సీతమ్మ వాకిట్లో...

సీతమ్మ వాకిట్లో...

మొదట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని వెంకటేష్, పవన్ కాంబినేషన్ లో చేద్దామనుకున్నారు. కానీ మహేష్, వెంకటేష్ లతో పట్టాలు ఎక్కింది.

రిజెక్టు చేసినవి

రిజెక్టు చేసినవి

పవన్ కళ్యాణ్ కు కథ చెప్పి రిజెక్టు చేయటంతో వేరే హీరోలు చేసిన ఇడియట్, పోకిరి, అతడు, అమ్మా నాన్న తమిళ అమ్మాయి, వంటివి పెద్ద హిట్ అయ్యాయి.

వినాయిక్ తో

వినాయిక్ తో

అత్తారింటికి దారేది కు ముందు వివి వినాయిక్ దర్సకత్వంలో పవన్ తో సినిమా అనుకున్నారు కానీ అది మెటీరియలైజ్ కాలేదు.

సంపత్ నందితో

సంపత్ నందితో

సంపత్ నందితో గబ్బర్ సింగ్ 2 అనుకుని ప్రారంభించారు. కానీ ఆగిపోయి సీన్ లోకి బాబి వచ్చి చేరారు. కథ కూడా మారిపోయింది.

English summary
Pawan Kalyan is the only actor in the current generation to have a number of projects that were shelved, after various stages of film-making.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu