»   » కొన్ని తెలిసినవి, చాలా తెలియనవి : మన స్టార్ హీరోయిన్స్...పబ్లిక్ అయిన వారి లవ్ ఎఫైర్స్

కొన్ని తెలిసినవి, చాలా తెలియనవి : మన స్టార్ హీరోయిన్స్...పబ్లిక్ అయిన వారి లవ్ ఎఫైర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మీకు ఫలానా హీరోతో ఎఫైర్ నడుస్తోందని బయిట వినపడుతోంది..అని మీడియా వ్యక్తి అడగటం వెంటనే..నో..నో మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్.అని నటీమణులు అనటం మనం చాలా సార్లు విని ఉంటాం, చదువుతాం. తమ పర్శనల్ విషయాలను, రిలేషన్ షిప్స్ ని మీడియాలో రావటానికి సెలబ్రెటీలు ఒప్పుకోరు. అయితే ఒక్కోసారి వారు అవును..మేం రిలేషన్ లో ఉన్నాం అని చెప్పే క్షణాలు ఎదురౌతాయి. అలా మన హీరోయిన్స్ తమ రిలేషన్ షిప్స్ గురించి చెప్పిన కొద్ది విశేషాలను మీ ముందు ఉంచుతున్నాం.

వాస్తవానికి వారు బోల్డ్ యాటిట్యూడ్ తో చెప్పారనుకోవాల్సిన పనిలేదు. ఆ క్షణం ఎందుకనో అలా నాలుక జారతారు. అయితే ఆ తర్వాత మీడియాలో అదే పనిగా వారి గురించి వస్తున్న వార్తలు చదవి కొందరు సంతోషపడితే, మరికొందరు అనవసరంగా నోరు జారామే అని ఫీలవుతారు. ఎందకంటే తమ ప్రెవేట్ లైఫ్ లు పబ్లిక్ లో రావటం వలన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తాము జెన్యూన్ గా చెప్పామనుకున్నా చాలా సార్లు అవి చిలవలు పలవలు అయిపోతూంటాయి.

ఇక్కడ కొంతమంది హీరోయిన్స్, పబ్లిక్ గా తమ ప్రేమ వ్యవహారాలు బయిటకు చెప్పినవారిని ప్రస్దావిస్తున్నాం. తమని గాఢంగా ప్రేమించే మరికొంతమంది పిచ్చి ప్రేమికలు బాధపడతారని తెలిసినా వాళ్లు తమను తాము కంట్రోలు చేసుకోలేని క్షణాల్లో చెప్పిన వాస్తవాలు ఇవి.

నిత్యామీనన్, రెజీనా తమ ప్రేమ వ్యవహారాలు గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. ఈ మధ్యన నిత్యామీనన్ తాను ఇంటర్ మీడియట్ అప్పుడు ప్రేమలో పడ్డానని చెప్పింది అంతే. వారు తాము డేటింగ్ చేస్తున్నా...ఆ విషయాలు బయిటపెట్టడం లేదు.

స్లైడ్ షోలో కొంతమంది హీరోయిన్స్ ..వారి లవ్ ఎఫైర్స్

అనుష్క

అనుష్క

వేదం అంటే 2010లో షూటింగ్ జరిగేటప్పుడు తన మనస్సుకు నచ్చినవాడు దొరికాడు అని రివీల్ చేసింది కానీ , తర్వాత ఎక్కడా అతను ఫలానా అని చెప్పలేదు. ఇప్పటివరకూ మళ్లీ ఆ టాపిక్ తేనూ లేదు.

సమంత

సమంత

సమంత,సిద్దార్ద ల మధ్య లవ్ ఎఫైర్ జరిగినప్పుడు ఆమె ఆ విషయం దాయటానికి ప్రయత్నమైతే చేయలేదు. బ్రేకప్ అయినప్పుడు కూడా ప్రపంచమంతా తెలిసింది. ఇప్పుడు నాగచైతన్యతో లవ్ స్టోరీ ..ఫలానా కుర్రాడు అని చెప్పలేదు..కానీ క్లూలు ఇచ్చేసి మరీ రివీల్ చేసేసింది.

హన్సిక

హన్సిక

పాపం హన్సిక ది ఓ సాడ్ లవ్ బ్రేకప్ స్టోరి. ఆమె శింబుతో ప్రేమలో ఉందని అందరికీ తెలిసేలా మాట్లాడింది. బిహేవ్ చేసింది. ఆ తర్వాత బ్రేక్ అప్ అయిన విషయాన్ని కూడా అంతలా ప్రచారంలోకి తీసుకుని వచ్చింది.

శ్రుతిహాసన్

శ్రుతిహాసన్

సమంత కన్నా ముందు సిద్దార్ద..శ్రుతి హాసన్ తో డేటింగ్ చేసాడు. ఆమె అప్పట్లో మాట్లాడిన ఇంటర్వూలో ఈ విషయం స్పష్టం చేసింది. అయితే అంతే స్పీడుగా బ్రేకప్ కూడా జరిగిందనుకోండి.

ఇలియానా

ఇలియానా

ఇలియానా గురించి చెప్పేదేముంది. తన ఆస్ట్రేలియన్ బోయ్ ఫ్రెండ్ గురించి రోజూ ట్విట్టర్ లోనో, ఫేస్ బుక్ లోనూ ఫోటోలతో సహా..చెప్తూ,చూపిస్తూనే ఉంది

ప్రియమణి

ప్రియమణి

ప్రియమణి తన లవర్ ఇప్పుడుకాబోయే భర్త ముస్తఫా రాజ్ గురించి సోషల్ మీడియాలో చెప్పి , చెప్పి దుమ్ము రేపింది, తర్వాత వాళ్లిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నరు.

నయనతార

నయనతార

ఈమె గురించి ఏం చెప్పేది. శింబు తో మొదట ఎఫైర్, ఆ తర్వాత ప్రభుదేవాతో వివాహం దాకా వెళ్లి ఆగిపోవటం, ఇదిగో ఇప్పుడు ఈ తమిళ దర్సకుడు తో ఎఫైర్ అంతా బహిర్గతమే.

తాప్సీ

తాప్సీ

తాప్సీ కూడా కొంతకాలంతమిళ నటుడు మహత్ రాఘవేంద్రతో ఎఫైర్ నడిపింది. అది తమిళ మీడియాలో దుమ్ము రేపింది. తర్వాత ఏమైందో ఏమో బ్రేక్ అప్ అయిపోయింది.

శ్రద్దాదాస్

శ్రద్దాదాస్

శ్రద్దాదాస్ లవ్ స్టోరీ విత్ వరుణ్ సందేశ్ పేరుతో ఎన్నో కధనాలు వచ్చాయి. వీరిద్దరూతమరు రిలేషన్ ఉందని అన్నారు. అయితే వరుణ్ సందేశ్ వేరే అమ్మాయితో ముందుకు వెళ్లిపోయాడు జీవితంలో

త్రిష

త్రిష

త్రిష ప్రేమ, పెళ్లి వ్యవహారం కూడా సినిమా స్టైయిల్ లో జరిగింది. ఎంగేజ్ మెంట్ అయ్యిపోయాక కట్ అయ్యిపోయింది. అయితే లవ్ లో ఉన్నప్పుడు అఫీషియల్ గానే తమ విషయం ఖరారు చేసారు వీరిద్దరూ.

English summary
Though it is common to hear the most clichéd answer from the actresses, like "we are just good friends", when asked about their relationships or hook-ups, there are quiet a few actresses, who never shied away from admitting their relationships in public.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu