»   » పండుగాడికి పదేళ్ళు

పండుగాడికి పదేళ్ళు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ కు మాస్ ఇమేజ్ ను, తిరుగులేని స్టార్ డమ్ ను తీసుకొచ్చిన చిత్రం పోకిరి. "ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, ఎవ్వడు కోడితే మైండు బ్లాకవ్వుద్దో ఆడే పండుగాడు" వంటి డైలాగ్ తో పాటు సినిమాలో చాలా డైలాగ్స్ ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. ఇన్స్టాంట్ గా అప్పటి కుర్ర గ్యాంగుల్లో పండు పేరు పెట్టుఇకున్న హీరోలు పెరిగిపోయారు.

నిజానికి హీరోఇజం అంటే పోకిరీకి ముందూ పోకిరీతర్వాత అన్నంతగా ముద్ర వేసింది ఆ సినిమా. హీరోలను మాస్ స్టయిల్ లో డిఫరెంట్ గా చూపించే పూరి జగన్నాథ్, మహేష్ బాబు నే కాదు తెలుగు సినిమా హీరోనే కొత్త స్టైయిల్ లో ప్రజెంట్ చేశాడు. నిజానికి పోకిరి కథ కొత్తదేం కాదు,సినిమా దృష్టిలో చూస్తే అతి సాధారణ కంటెంట్. కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ లో పూరీ డైరెక్టర్ గా తన మార్క్ చూపించాడు.

10 years for Industry Hit Pokiri

అప్పటి వరకూ చిన్న సినిమాల డైరెక్టర్ గా ఉన్న పూరీని ఒక్కసారిగా టాప్ లీగ్ లో కూర్చోపెట్టిన సినిమా ఇది. మహేష్ కెరీర్ కు పూర్తి మాస్ కిక్ ఇచ్చిన సినిమా ఇది. ఏప్రిల్ 28, 2006. పోకిరి రీలీజ్ డేట్. ఆ రోజున విడుదలైన పోకిరీ, ఆంధ్రప్రదేశ్ లో ప్రభంజనం సృష్టించింది. పండు గాడి దెబ్బ రికార్డులు బద్ధలైపోయాయి. బాక్సాఫీస్ కు దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయింది. 200 సెంటర్లలో 100 రోజులు, 40 కోట్ల షేర్ సాధించిన మొదటి తెలుగు సినిమా పోకిరి.

సరిగ్గా పదేళ్ళ క్రితం ఇదే రోజున రిలీజ్ అయిన పోకిరి ఓవర్నైట్ మహేష్ బాబుని సూపర్ స్టార్ని చేసింది. మహేష్ యాక్టింగ్ ,పూరి జగన్నాద్ డైరెక్షన్ ,మణిశర్మ సంగీతం ,ఇలియానా అందం మొత్తం కలిపితే బాక్సులు బద్దలయ్యే ఇండస్ట్రీ హిట్ పోకిరి. పోకిరికి ముందు మహేష్ స్టార్ హీరో మాత్రమే కానీ పోకిరి తర్వాత సూపర్ స్టార్ అయ్యాడు .

ఈ రోజుతో ఈ అండర్ కవర్ కాప్ పోకిరీ హీరోకి పదేళ్ళు నిండాయి.ఈ పదేళ్ళలోనూ మహేష్ ఎంతో ఎదిగారు,ఇలియానా టాప్ హీరోయింగా కొన్నాళ్ళు వెలిగింది, దర్శకుడు పూరీ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. అయినా ఇప్పటికీ పోకిరీ సినిమా చూస్తూంటే అదే ఫ్రెష్ ఫీలింగ్ ఏమాత్రం బోరుకొట్టదు. వీలుంటే మరోసారి సినిమా చూసి పదెళ్ళ కిందటి ఆ ఫీల్ ని మళ్ళీ పొందండి...

English summary
Mahesh Babu's Industry hit 'Pokiri' completes 10 Years
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu