»   »  తండ్రి వాచీనే కాదు స్టైల్ ని కూడా నాగార్జున

తండ్రి వాచీనే కాదు స్టైల్ ని కూడా నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున కి తొలి నుంచి తన తండ్రి అక్కినేని అంటే ప్రాణం. అందుకేనేమో ఆయన తండ్రి వాడిన వాచీని తన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయినాలో ఉపయోగిస్తున్నారు. ఆ రకంగా తన జ్ఞాపకాలను పదిలం చేసుకుంటున్నారు.

ఎ.ఎన్.ఆర్ వాడిన 1959 నాటి వాచీ అది. ఈ సినిమాలో బంగార్రాజు పాత్ర ఆ వాచితో కనపడుతుంది. వాచితో పాటు, పంచెకట్టుకు వన్నె తెచ్చిన నాగేశ్వరరావు గారు స్టైల్ ని కూడా నాగార్జున ఫాలో అవ్వడం బాగుందని హర్షాన్ని వ్యక్తం చేసారు.


ఇంచుమించు ఈ సినిమా ఎ.ఎన్.ఆర్ నటించిన శ్రీరామరక్ష సినిమాను పోలి ఉంటుందని ఫిల్మ్ నగర్ సమాచారం. అప్పట్లో సుపర్ హిట్ సినిమా. ఇంచుమించు అదే కథ అయితే సినిమా సూపర్ హిటే అయ్యే అవకాశం ఉంది.


అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'సోగ్గాడే చిన్నినాయన'. ఈ చిత్రానికి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


1959 ANR's watch used in Soggade Chinninayina

సినిమా గురించి నాగార్జున గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తొలిసారిగా ‘సోగ్గాడే చిన్నినాయనా' ఫుల్ కామెడీ చిత్రంలో తాను నటిస్తున్నానని, సోగ్గాడిగా, అమాయకుడిగా రెండు పాత్రల్లో తేడాలు ప్రేక్షకులకు నచ్చుతాయని తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలో తండ్రి పాత్ర ఇందులో ఘోష్ట్‌గా కనిపిస్తుందని, చనిపోయిన తర్వాత కొడుక్కుమాత్రమే కనబడే విచిత్రమైన ఆ పాత్రలో తాను నటించానని తెలిపారు.


ఫాదర్‌ క్యారెక్టర్‌ ఇందులో ఘోస్ట్‌గా కనిపిస్తుంది. చనిపోయిన తర్వాత కొడుక్కి మాత్రమే కనబడే విచిత్రమైన క్యారెక్టర్‌ అది. ఈ పాయింట్‌ వినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌ అనిపించింది. వెంటనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. రెండు క్యారెక్టర్స్‌ను బేస్‌ చేసుకుని 'సొగ్గాడే చిన్ని నాయనా' అనే టైటిల్‌ పెట్టామని తెలిపారు నాగార్జున.


నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, సంపత్‌,నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, యాంకర్‌ అనసూయ, దీక్షా పంత్‌, బెనర్జీ, సురేఖా వాణి, దువ్వాసి మోహన్‌, రామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: పి.రామ్మోహన్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, సిద్ధార్థ్‌ రామస్వామి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, మాటలు-దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ.

English summary
In Soggade Chinni Nayana, the father character Bangaarraju will be sporting a wrist watch, and that is late ANR's watch which the late actor bought in 1959.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu