»   » బాలకృష్ణకు సోడా కి ముడి పెట్టారు (పోస్టర్)

బాలకృష్ణకు సోడా కి ముడి పెట్టారు (పోస్టర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కాంట్రావర్శీ లేనిదే జనం దృష్టి పడటం లేదు. అందుకే చిన్న సినిమావాళ్లు పబ్లిసిటీ కోసం పలు రకాలైన టెక్నిక్స్ వాడుతున్నారు. మొన్న మహేష్ బాబు కిడ్నాప్ అంటూ హడావిడి చేసినట్లే ఇప్పుడు మరో పోస్టర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇదేగా ఆశపడ్డావ్ బాల-కృష్ణా టైటిల్ తో ఓ చిత్రం వస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా విడుదల చేసారు. దానికి ట్యాగ్ లైన్ గా బెస్ట్ వాచెడ్ విత్ సోడా అని పెట్టారు. మీరు చూస్తున్న ఫస్ట్ లుక్ ఇదే.

బాలకృష్ణకు మాన్షన్ హౌస్ అంటే ఇష్టమనే టాక్ చాలా కాలంగా మీడియాలో ఉంది. దాన్ని బేస్ చేసుకునే ఈ పోస్టర్ క్రియేట్ చేసి కాంట్రావర్శీ క్రియేట్ చేద్దామనే నిర్మాతల ఐడియా అంటున్నారు. మాన్షన్ హౌస్ బాటిల్ ని పెట్టి లేబుల్ స్దానలో.. దీనికేగా ఆశపడ్డావ్ బాలకృష్ణ అని పెట్టి..క్రింద సోడాతో కలిపి తాగమని..అంటున్నారు. ఇక ఈ చిత్రం ఓ తమిళ డబ్బింగ్. తమిలంలో వచ్చి విజయవంతమైన Idharkuthane Aasaipattai Balakumara ని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు.

Idhega Aasapaddav Bala-Krishna

విజయసేతుపతి హీరోగా వచ్చిన ఈ చిత్రం అక్కడ మంచి విజయమే సాధించింది. క్రైమ్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో విజయ సేతుపతి హీరోగా చేసారు. గోకుల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులోనూ హిట్ అవుతుందని భావిస్తున్నారు. త్వరలో టీజర్ ని,ఆడియో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రేడ్ లోనూ ఈ పోస్టర్ మంచి క్రేజ్ నే క్రియేట్ చేసిందనే చెప్పాలి.

English summary
“Idhegaa Aasa Paddaav Bala Krishna” is the latest film of Colors Swathi that was shot originally in Tamil [titled: Idharkuthane Aasaipattai Balakumara] and is being dubbed into Telugu now… Vijay Sethupathy is the hero in this innovative thriller and Gokul is the director!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu