Just In
- 54 min ago
అభిమాని పెళ్లిలో సడన్‌గా ప్రత్యక్షమైన స్టార్ హీరో.. అతిధులంతా షాక్!
- 1 hr ago
రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ రూమర్స్ అన్ని అబద్ధాలే!
- 1 hr ago
బిగ్ బాస్ 5 మొదలయ్యేది ఎప్పుడంటే.. మరోసారి సోహెల్ కూడా..
- 2 hrs ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
Don't Miss!
- News
వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం -కుటుంబాలపై ఇలా రాయొచ్చా? నీతిమాలిన చర్యలంటూ..
- Sports
షకీబుల్ అరుదైన రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్లో ఏకైక ప్లేయర్‌గా!!
- Finance
ఈఎస్ఐ పథకంలో చేరిన 9.33 లక్షల మంది.. డేటా రిలీజ్
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నరుడా..డోనరుడా : వీర్య దాతగా సుమంత్ ఫస్ట్ లుక్ ఇదే (ఫోటోస్)
హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున మేనల్లుడు సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయినా స్టార్ హీరో రేంజికి ఎదగలేక పోయాడు. అయితే తనకు సూటయ్య సినిమాలు ఎంచుకుంటూ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

హీరో సుమంత్ కథానాయకుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..! డోనరుడా..! ఫస్ట్ లుక్‌ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లోని విలక్షణత వల్ల ఫస్ట్‌లుక్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.
ఈ సినిమాతో పల్లవి సుభాష్ హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. తనికెళ్ళభరణి ఈ చిత్రంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. గోల్కొండ హైస్కూల్, ఊహలు గుసగుసలాడే చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన మల్లిక్‌రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

క్షణం వంటి సూపర్‌హిట్ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందించిన షనీల్ డియో ఈ సినిమా సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, క్షణం, గుంటూర్ టాకీస్ వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించిన శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కిట్టు విస్సాప్రగడ, సాగర్ రాచకొండ మాటలు అందిస్తున్నారు. వై.సుప్రియ, జాన్ సుధీర్ పూదోట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలక్ష్మి, సుమన్ శెట్టి, భద్రమ్, జబర్‌దస్త్ శేషు, సుంకరలక్ష్మి, పుష్ప, చలపతిరాజు ఇతర తారాగణంగా నటించారు.