»   » రోబో 2.0 స్థాయిలో లైకా ప్రొడక్షన్స్ మరో ప్రాజెక్టు: రామ్ చరణ్, మురుగదాస్ కలయిక

రోబో 2.0 స్థాయిలో లైకా ప్రొడక్షన్స్ మరో ప్రాజెక్టు: రామ్ చరణ్, మురుగదాస్ కలయిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్పైడర్ సినిమాను తెరకెక్కిస్తున్న మురుగదాస్, త్వరలో మరో టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో సినిమా ప్లాన్ చేస్తున్నారట. స్పైడర్ తర్వాత కోలీవుడ్ ఇళయదళపతి విజయ్‌తో మరో సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు మురుగ దాస్. ఈ సినిమా సెట్స్ మీదకు ఇంకా వెళ్లకుండానే ఆ తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తున్నాడు. ఆ సినిమాను మరో తెలుగు హీరోతోనే చేయాలని ప్లాన్ చేస్తున్నారట కోలీవుడ్ నిర్మాతలు. మెగా ఫ్యామిలీ వారసుడు రామ్ చరణ్‌తో మురుగదాస్ జోడీ కట్టేలా కోలీవుడ్ నిర్మాతలు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది.

రొటీన్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలు చేస్తున్న రామ్ చరణ్, మురుగదాస్ దర్శకత్వంలో కమర్షియల్ ఎంటర్ టైనర్ చేసేందుకు ఓకె చెప్తాడని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టేలా ఉంది. ప్రస్తుతం రోబో 2.0 సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్.. మురుగదాస్-చెర్రీ కాంబినేషన్ కోసం ట్రై చేస్తోందని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, స్పైడర్ తర్వాత విజయ్‌తో మురుగదాస్ మూవీ చేయబోతున్నారు కాబట్టి.. ఈ కాంబినేషన్ వాస్తవ రూపం దాల్చాలంటే మరి కొన్ని నెలలు ఆగాల్సిందే. కాగా, గతంలో చెర్రీ తండ్రి చిరంజీవితో మురుగదాస్ స్టాలిన్ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే.


 2.0 Makers Planning Charan-Murugadoss Project?

అయితే మురుగ దాస్‌తో పని చేయాలన్న చనణ్ కోరిక ఇప్పటిది కాదు. సరిగ్గా ఆరేళ్ళ క్రితం 'సెవెంత్ సెన్స్' డబ్బింగ్ సినిమా ఆడియో ఫంక్షన్లోనే మురుగదాస్ ని ఆకాశానికి ఎత్తేశాడు. చెర్రి "ప్రతి హీరో మీ దర్శకత్వంలో చేయాలని కోరుకుంటాడు. నేనూ అలాగే కోరుకుంటున్నాను. ప్లీజ్... నాతో ఓ సినిమా చేయండి..." అంటూ మురుగదాస్ ని చరణ్ రిక్వెస్ట్ చేస్తున్నట్టు అడిగేసాడు.


English summary
fresh reports are now coming out that Murugadoss may direct Ram Charan. Lyca Productions, which is bankrolling Superstar Rajinikanth's '2.0', is reportedly planning to enter the Telugu film industry with a biggie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu