»   » ‘రోబో 2.0’ షాకింగ్ న్యూస్.. బాబోయ్ రజనీ, అక్షయ్ అన్నిపాత్రలా..!

‘రోబో 2.0’ షాకింగ్ న్యూస్.. బాబోయ్ రజనీ, అక్షయ్ అన్నిపాత్రలా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచేపోయే చిత్రాలుగా రోబో 2.0, బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రాలు రూపుదిద్దుకొంటున్నాయి. అత్యధిక భారీ బడ్జెట్‌తో రూపొందుకొంటున్న రోబో 2.0 చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు రోజుకోటి వెలుగులోకి వస్తున్నాయి.

ప్రేక్షకులకు థ్రిల్లింగ్ న్యూస్

ప్రేక్షకులకు థ్రిల్లింగ్ న్యూస్

రోబో 2.0 చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ అభిమానులను థ్రిల్ గురిచేసింది. రోబో చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రజనీకాంత్ ఐదు పాత్రలు, అక్షయ్ కుమార్ 12 డిఫరెంట్ లుక్స్‌తో కనిపించనున్నారనే వార్త వెలుగు చూసింది.

ఐదు పాత్రల్లో రజనీకాంత్

ఐదు పాత్రల్లో రజనీకాంత్

రోబో2 సినిమాలో డాక్టర్ వశీకరణ్, చిట్టి ది రోబో పాత్రలే కాకుండా మరో విభిన్నమైన పాత్రలతోపాటు విలన్ పాత్రలో కూడా కనిపించనున్నట్టు సమాచారం. ఈ పాత్రలను అద్భుతమైన రీతిలో దర్శకుడు శంకర్ తెరకెక్కించినట్టు తెలుస్తున్నది.

అక్షయ్ 12 డిఫరెంట్ లుక్స్

అక్షయ్ 12 డిఫరెంట్ లుక్స్

ఇదిలా ఉండగా, ఈ సినిమాలో అక్షయ్ కుమార్ దాదాపు 12 డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారని తెలుస్తున్నది. ఈ పాత్రలన్నీ ప్రేక్షకులను థ్రిల్లింగ్ గురిచేయడం ఖాయమనే మాట వినిపిస్తున్నది.

 రియల్ హీరో అక్షయ్ కుమారే..

రియల్ హీరో అక్షయ్ కుమారే..

ఈ చిత్ర ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో అక్షయ్ పాత్ర బ్రహ్మడంగా ఉంటుంది. ఈ సినిమాలో రియల్ హీరో అక్షయ్ కుమార్ మాత్రమే అని రజనీకాంత్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆసియా దేశాల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ సినిమా సుమారు రూ.400 కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్నది.

రికార్డు ధరకు శాటిలైట్ రైట్స్

రికార్డు ధరకు శాటిలైట్ రైట్స్

ఈ సినిమా శాటిలైట్ హక్కులు రికార్డు స్థాయిలో రూ.110 కోట్లు చెల్లించి జీ టెలివిజన్ దక్కించుకొన్నది. ఈ సినిమాలో ఆమీ జాక్సన్, సుధాంశు పాండే, ఆదిల్ హుస్సేన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు. నిరవ్ షా సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

English summary
superstar Rajinikanth will be essaying five roles and Akshay Kumar will be seen in 12 different makeovers for Shankar's sci fi thriller 2.0.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu