»   » టాక్ ఎఫెక్ట్....మహేష్ ‘1’లో 20 నిమిషాలు కోత

టాక్ ఎఫెక్ట్....మహేష్ ‘1’లో 20 నిమిషాలు కోత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' చిత్రం శుక్రవారం గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తొలి రోజు సినిమాకు అనుకున్న రేంజిలో హిట్ టాక్ రాలేదు. సినిమాలో చాలా బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయని పలువురు సినీ గోయర్స్ విమర్శించడంతో....వెంటనే నిర్మాతలు నివారణ చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా సినిమాలోని బోరింగ్ సన్నివేశాలు తొలగించి 20 నిమిషాల నిడివి తగ్గించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర స్వయంగా వెల్లడించారు. ట్రిమ్ చేసిన వెర్షన్ రేపటి నుంచి ప్రదర్శితం అవుతుందని ఆయన తెలిపారు. మరి ట్రిమ్ చేసిన వెర్షన్ ప్రేక్షకులను ఏ మేరకు సంతృప్తి పరుస్తుందో చూడాలి. ఏది ఏమైనా నిర్మాతల ప్రయత్నం, తాపత్రయం చూస్తుంటే ప్రేక్షకులను సంతృప్తి పరచడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1500 స్క్రీన్లలో సినిమా విడుదలైంది.

టెక్నికల్‌గా సినిమా హాలీవుడ్ సినిమాల స్ధాయిలో హై స్టాండర్డ్స్‌లో ఉండాలని సుకుమార్ ఫిక్సై తీసాడని మొదటి ఫ్రేమ్ నుంచే అర్దమవుతుంది. అయితే ఈచిత్రం తెలుగు ప్రేక్షకుల టేస్టుకు తగిన విధంగా లేదనేది మరికొందరి వాదన. అయితే టెక్నికల్ వ్యాల్యూస్ తెలిసిన వారు మాత్రం....ఇది ప్యూర్ టెక్నికల్ ఫిల్మ్, మూస తెలుగు సినిమాల్లా కాకుండా డిపరెంట్ జానర్లో దర్శకుడు తెరకెక్కించాడు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రేంజిలో ఉందని అంటున్నారు.

ఇక సినిమా వివరాల్లోకి వెళితే..... సకుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో క్రితి సానన్ హీరోయిన్‌గా నటించింది. మహేష్ తనయుడు గౌతం కృష్ణ ఈ చిత్రంతో బాల నటుడిగా తెరంగ్రేటం చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకరలు ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ అనే బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ కూడా ఈచిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంది.

English summary
Based on the feedback received from movie lovers, '1 Nenokkadine' movie producers have decided to trim about 20 minutes from the film. The news was confirmed by producer Anil Sunkara.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu