»   »  న్యూ ఇయిర్ : సమంత,అనుష్క, కాజల్ ఎక్కడ?

న్యూ ఇయిర్ : సమంత,అనుష్క, కాజల్ ఎక్కడ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 2013 వెళ్లిపోతోంది...2014 ఉత్సాహంగా దూసుకు వచ్చేస్తోంది. క్యాలెండర్‌ మార్చుకోవడానికి కొన్ని గంటలే వ్యవధి. హిట్లో, ఫ్లాపులో, మెరుపులో, మరకలో ఏవో ఒకటి మిగిల్చి 2013 వెళ్లిపోతోంది.

సినిమా వాళ్లు డిసెంబర్‌ 31న అర్ధ రాత్రి పన్నెండు గంటల వరకూ మేల్కొనే ఉంటారు. సరిగ్గా పన్నెండుకి కిటికీలూ, గుమ్మాలూ తెరుస్తారు. కొత్త సంవత్సరం ఇంట్లో సమస్యల్నీ, బాధల్నీ బయటకు తీసుకెళుతుందని దానర్థం. నూతన సంవత్సరం కొత్త ఆశలతో వస్తుందని నమ్మకం.

'కొత్తకు ఎప్పుడూ స్వాగతం, పాతకు వందనం..' అంటూ పాడుకొంటూ కోటి ఆశలతో, ఆకాంక్షలతో రేపటి యేడాది గుమ్మం ముందు నిలబడ్డాం. ఈ క్షణంలో హీరోయిన్స్ ఆలోచనలు ఎలా ఉన్నాయి..? కొత్త సంవత్సర స్వాగత ఏర్పాట్లు ఎలా చేసుకొంటున్నారు?

స్లైడ్ షో లో....

అనుష్క

అనుష్క

'ఈ యేడాదంతా సినిమా షూటింగులతోనే గడిపా. 'వర్ణ', 'బాహుబలి', 'రుద్రమదేవి'.... ప్రతిరోజూ కత్తి తిప్పుతూనే ఉన్నా. 'మిర్చి' మంచి విజయం అందుకొంది. 'బాహుబలి'లో రాజమౌళి మ్యాజిక్‌ మరోసారి కనిపిస్తుంది. 'రుద్రమదేవి'పై నాకెంతో భరోసా ఉంది. 2014 నా కెరీర్‌లోనే ఓ మేలిమలుపు అని భావిస్తున్నా. ఎందుకంటే 'రుద్రమదేవి' ఈ యేడాదే వస్తుంది. ఎప్పట్లా కమర్షియల్‌ సినిమాలు చేయాలని ఉంది''

కాజల్‌

కాజల్‌


''డిసెంబరు నెలంతా షాపింగులతోనే గడిచిపోయింది. చెల్లాయి పెళ్లి కదా, హడావుడి అంతా నాదే. డిసెంబరు 31 కుటుంబ సభ్యుల మధ్యే గడుపుతా. ఈ యేడాది 'నాయక్‌', 'బాద్‌షా' ఫలితాలు సంతృప్తినిచ్చాయి. ఇటు కుటుంబంతోనూ సమయం గడిపే అవకాశం వచ్చింది. 2013 అంతా ప్రశాంతంగా గడిచిపోయింది. వచ్చే యేడాదీ ఇలాగే ఉండాలనుకొంటున్నా''

సమంత

సమంత


''డిసెంబరు 31 అనే కాదు, నాకు ప్రతీరోజూ ప్రత్యేకమే. ప్రతిక్షణం కొత్తగా మొదలుపెట్టాలని ఆలోచిస్తుంటా. 2013 చాలా బాగా గడిచింది. విజయాలు సరికొత్త ఉత్సాహాన్ని తెచ్చాయి. వాటిలో 'అత్తారింటికి దారేది' సినిమాని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ యేడాదితో పోలిస్తే 2014 కాస్త విభిన్నంగా ఉంటుందని ఆశిస్తున్నా. మలయాళంలో ఓ సినిమా చేస్తా. అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో చూడాలి''

అమలాపాల్‌

అమలాపాల్‌


''పండగలు, ప్రత్యేక సందర్భాలు వస్తే... నా కుటంబ సభ్యుల మధ్య ఉండాల్సిందే. ఈ యేడాది నూతన సంవత్సర వేడుకని ఇటలీలో జరుపుకోబోతున్నాను. వారం రోజులు అక్కడే సరదాగా గడిపి వస్తాం''

ప్రియమణి

ప్రియమణి
''ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా గడిపాను. అన్ని భాషల్లో కలిపి ఎనిమిది సినిమాల్లో కనిపించాను. 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'లో షారుఖ్‌తో ఓ పాటలో డ్యాన్స్‌ చేయడం ఎప్పటికీ మరచిపోలేను. కొత్త సంవత్సరం ఉత్సవాల్ని థాయ్‌లాండ్‌లో జరుపుకుంటున్నాను. వచ్చే ఏడాది నా జీవితం మరింత అందంగా ఉంటుందని ఆశిస్తున్నాను''

English summary
The New Year is already On…Parties and Bashes seducing everywhere…Tollywood Heroines are busy this night and share their views on this occassion.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu