For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2018 టాలీవుడ్ సూపర్ హిట్స్.. ఆరంభం అనుష్కదే.. బడా హీరోల్లో ఆ ముగ్గురు మాత్రమే!

  |

  2017తో పోల్చుకుంటే 2018లో టాలీవుడ్ కు ఎక్కువ విజయాలు దక్కాయి. ఎప్పటిలాగే స్టార్ హీరోలే బాక్సాఫీస్ వద్ద అదరగొట్టారు. చిన్న చిత్రాల ప్రభావం అంతంత మాత్రంగానే నిలిచింది. అద్భుతాలు సృష్టించిన చిన్న చిత్రాలు చాలా తక్కువ. మహేష్, రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల చిత్రాలు అంచనాలకు తగ్గట్లుగా సత్తా చాటాయి. కొన్ని లేడి ఓరియెంటెడ్ చిత్రాలు కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మెరిశాయి. ఇలాంటి విశేషాలతో 2018లో సూపర్ హిట్ గా నిలిచిన టాలీవుడ్ చిత్రాల వివరాలు చూద్దాం!

  భాగమతి

  భాగమతి

  ఈ ఏడాది తొలి సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం భాగమతి అని చెప్పొచ్చు. అనుష్క లేడీ సూపర్ స్టార్ అని చెప్పడానికి ఈ చిత్రం ఒక నిదర్శనం. భాగమతిలో అనుష్క అద్భుతమైన నటన కనబరిచింది. హర్రర్ ఎలిమెంట్స్ ఉండే చిత్రంలో తన నటనతో చిత్రానికి ప్రాణం పోసిందని చెప్పొచ్చు. జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి జి అశోక్ దర్శత్వం వహించారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో భాగమతి చిత్రం రూపొందింది. ప్రపంచ వ్యాప్తంగా భాగమతి చిత్రం 34 కోట్ల షేర్ వసూలు చేసింది.

   ఛలో

  ఛలో

  యువ హీరో నాగశౌర్య చాలా రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఛలో రూపంలో సూపర్ హిట్ దక్కింది. ఈ ఏడాది విజయం సాధించిన తొలి చిన్న చిత్రంగా ఛలోని పేర్కొనవచ్చు. డెబ్యూ దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. టాలీవుడ్ లో సెన్సేషనల్ గా మారిన యంగ్ హీరోయిన్ రష్మిక మందన ఈ చిత్రంతోనే ఎంట్రీ ఇచ్చింది. లవ్, కామెడీ లాంటి అంశాలతో ఆడియన్స్ ని ఈ చిత్రం బాగా ఎంటర్ టైన్ చేసింది. వసూళ్ల పరంగా ఈ చిత్రం రెండింతల లాభం తెచ్చిపెట్టి ఘనవిజయంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఛలో చిత్రం 12 కోట్ల షేర్ రాబట్టింది.

  2018లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్... ఎన్నికోట్ల నష్టం అంటే?

   తొలిప్రేమ

  తొలిప్రేమ

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ప్రేమకథగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. వరుణ్ తేజ్, రాశి ఖన్నా మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రంలో హైలైట్. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో మూడు వేరియషన్స్ లో నటించి మెప్పించాడు. ఎస్ఎస్ తమన్ అందించిన సంగీతం చిత్రంలో మరో ఆకర్షణీయమైన అంశం. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ప్రపంచ వ్యాప్తంగా తొలిప్రేమ చిత్రం 24 కోట్ల షేర్ రాబట్టడం విశేషం.

   రంగస్థలం

  రంగస్థలం

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతే కాదు తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి తరువాత అతిపెద్ద విజయంగా నిలిచి రికార్డు సృష్టించింది. దర్శకుడు సుకుమార్, రాంచరణ్ రంగస్థలం చిత్రంతో అద్భుతమైన మ్యాజిక్ చేశారు. 1980 నాటి పరిస్థితులకు అనుగుణంగా సుకుమార్ గొప్పగా అనిపించే కథని చూపించారు. రాంచరణ్ లాంటి స్టార్ హీరో ఈ చిత్రంలో వినికిడి లోపంతో నటించడం మరో హైలైట్. విలన్ గా జగపతి బాబు, రామలక్ష్మి పాత్రలో సమంత, రంగమత్తగా అనసూయ, కుమార్ బాబుగా ఆది పినిశెట్టి ఇలా ప్రతి పాత్రకు ప్రాధాన్యం దక్కేలా సుకుమార్ ఈచిత్రాన్ని మలిచారు. ప్రపంచ వ్యాప్తంగా 123 కోట్ల షేర్ రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

  భరత్ అనే నేను

  భరత్ అనే నేను

  శ్రీమంతుడుతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ.. మహేష్ తో కలసి మరోమారు మ్యాజిక్ చేశాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం భరత్ అనే నేను ఘన విజయం సాధించింది. మహేష్ బాబు ఈ చిత్రంలో సీఎం పాత్రలో అదరగొట్టాడు. కమర్షియల్ అంశాలతో పేరు చక్కటి సోషల్ మెసేజ్ ని కొరటాల శివ ప్రేక్షకుల అందించాడు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ చిత్రంతో టాలీవడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. భరత్ అనే నేను చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.

  మహానటి

  మహానటి

  తెలుగు వారంతా ఎప్పటికీ మరచిపోలేని దిగ్గజ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా మహానటి చిత్రాన్ని తెరకెక్కించారు కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కించారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయి నటించింది. మహానటి సావిత్రి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 45 కోట్ల షేర్ రాబట్టి సంచలన విజయంగా నిలిచింది.

  ఆర్ఎక్స్ 100

  ఆర్ఎక్స్ 100

  చిన్న చిత్రంగా బాక్సాఫీస్ వద్దకు వచ్చిన ఆర్ఎక్స్ 100 చిత్రం అద్భుతం చేసిందని చెప్పొచ్చు. ఏమాత్రం పరిచయం లేని నూతన నటులతో డెబ్యూ దర్శకుడు అజయ్ భూపతి మ్యాజిక్ చేశారు. బోల్డ్ అండ్ ఎమోషనల్ ప్రేమ కథగా వచ్చిన ఈ చిత్రం యువతకు బాగా కనెక్ట్ అయింది. హీరో కార్తికేయ నటన, పాయల్ రాజ్ పుత్ అందాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దాదాపు 13 కోట్ల షేర్ ని ఆర్ఎక్స్ 100 చితం వసూలు చేసింది.

  గీత గోవిందం

  గీత గోవిందం

  అర్జున్ రెడ్డి చిత్రంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన విజయ్ దేవరకొండ ఈ ఏడాది గీత గోవిందం చిత్రంతో రచ్చ చేశాడు. విజయ్ దేవరకొండ క్రేజ్, రష్మిక మందన గ్లామర్, పరశురామ్ దర్శత్వంతో ఈ చిత్రం తిరుగులేని హిట్ గా నిలిచింది. యువతకు బాగా నచ్చడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. స్టార్ హీరో సినిమా రేంజ్ లో ఈ చిత్ర వసూళ్లు నమోదు కావడం విశేషం. కామెడీ, రొమాంటిక్, లవ్ అన్ని అంశాలు సమపాళ్లలో కుదరడంతో గీతగోవిందం చిత్రం ఈ ఏడాది పెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా గీత గోవిందం 70 కోట్ల షేర్ రాబట్టింది.

  అరవింద సమేత వీరరాఘవ

  అరవింద సమేత వీరరాఘవ

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత దసరాకి సందడి చేసింది. ఎన్టీఆర్ కెరీర్ లో అరవింద సమేత చిత్రం బిగ్గెస్ట్ హిట్. రాయలసీమ ఫ్యాక్షన్ కథతో త్రివిక్రమ్ మ్యాజిక్ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఫ్యాక్షన్ చిత్రాల కంటే భిన్నంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎన్టీఆర్ నటన, జగపతి బాబు విలనిజం ఈ చిత్రాల్లో హైలైట్ గా నిలిచిన అంశాలు. పూజా హెగ్డే గ్లామర్ కూడా చిత్రానికి ప్లస్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా అరవింద సమేత 95 కోట్లవరకు వసూళ్లు రాబట్టింది.

  టాక్సీవాలా

  టాక్సీవాలా

  విజయ్ దేవరకొండ టాక్సీవాలా చిత్రంతో ఈ ఏడాది మూడవసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా రోజులుఆ వాయిదా పడి విడుదల కావడంతో ఈచిత్రంపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్, హర్రర్ ఎలిమెంట్స్ తో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ జరిగింది. టాక్సీవాలా చిత్రం తిరుగులేని కమర్షియల్ హిట్ గా నిలిచింది. డెబ్యూ దర్శకుడు రాహుల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లకు పైగా టాక్సీవాలా షేర్ రాబట్టడం విశేషం.

  English summary
  2018 suepr hit movies in Tollywood. Rangasthalam, Bharath ane Nenu, Geetha Govindam are major hits
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X