Don't Miss!
- Sports
INDvsAUS : భారత్తో టెస్టు సిరీస్ ముందు.. బెంగళూరులో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ సెషన్స్
- News
హైదరాబాద్లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
2022లో చిన్న దర్శకుల హవా.. మొదటి సినిమాతోనే బిగ్ బాక్సాఫీస్ సక్సెస్!
2022లో కొన్ని ఊహించని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేశాయి. ఇక మొదటి సినిమాలతోనే కొందరు యువ దర్శకులు మంచి విజయాలను సొంతం చేసుకుని వారి కెరీర్ కు పూలబాటను వేసుకున్నారు. ముఖ్యంగా అయితే అన్ని రకాల జనార్స్ సినిమాలతోనూ కొత్త దర్శకులు బాగానే మెప్పించారు. ఇక ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్న కొత్త దర్శకుల వివరాల్లోకి వెళితే..

మసూద సాయి కిరణ్
అసలు పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందు ఏడాది వచ్చిన సినిమాలలో మసూధ ఒకటి. ఈ సినిమా మొదటి రోజు కంటే కూడా మిగతా నాలుగు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. హారర్ మూవీగా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సాయికిరణ్ తెరపైకి తీసుకువచ్చాడు. ఇక బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి ఈ సినిమా డబుల్ ప్రాఫిట్స్ అందించి ఈ దర్శకుడికి మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

బింబిసార దర్శకుడు
వశిష్ఠ దర్శకత్వంలో వచ్చిన బాంబిసార సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు ఈ సినిమా విడుదల కంటే ముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. దర్శకుడు ఫాంటసీ బ్యాక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో అన్ని రకాల ఎమోషన్స్ తో ఈ సినిమాను హైలైట్ చేసిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద సినిమా ఈజీగా 50 కోట్ల వసూళ్ళను అందుకొని దర్శకుడికి మంచి క్రేజ్ తీసుకువచ్చింది.

అశోక వనంలో అర్జున కళ్యాణం
'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా కూడా మంచి టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు ప్రాఫిట్స్ అందించింది. ఈ సినిమా దర్శకుడు విద్యాసాగర్ ఇంతకుముందు ఫలక్ నూమా దాస్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశాడు. ఇక మొదటిసారి అతను దర్శకుడుగా మారి విశ్వక్ సేన్ తో ఈ సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. పెద్దగా హడావిడి లేకుండా సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

డీజే టిల్లు.. విమల్ కృష్ణ
ఇక ఈ ఏడాది మొదట్లో వచ్చిన డీజే టిల్లు సినిమా సంక్రాంతి ఫెస్టివల్ లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరో మాటలు అలాగే బాడీ లాంగ్వేజ్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. దర్శకుడు విమల్ కృష్ణ మేకింగ్ కూడా మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాకు కూడా విడుదలకు ముందే టైటిల్ సాంగ్ తో మంచి బజ్ క్రియేట్ చేశారు. ఇక సినిమాలో డైలాగ్స్ అలాగే కొన్ని కామెడీ సీన్స్ కూడా విజిల్స్ వేయించాయి.

ఓకే ఒక జీవితం
ఇక ఎంతో కాలంగా ఇండస్ట్రీలో సహాయక దర్శకుడిగా కొనసాగుతున్న మరొక దర్శకుడు శ్రీ కార్తిక్ కూడా బాక్సాఫీస్ వద్ద ఒకే ఒక జీవితం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ ఎమోషనల్ కాన్సెప్ట్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా దర్శకుడి మేకింగ్ విధానం పై కూడా సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ విధంగా ఇండస్ట్రీకి అయితే 2022లో మంచి దర్శకులు పరిచయమయ్యారు.