»   » నిరాహార దీక్ష ప్రారంభంచిన ‘24’ చిత్ర నిర్మాత!

నిరాహార దీక్ష ప్రారంభంచిన ‘24’ చిత్ర నిర్మాత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సూర్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన '24' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. అయితే అన్ని సినిమాల్లానే ఈ సినిమాను పైరసీ భూతం వెంటాడుతోంది.

'24' చిత్రం విడుదలైన రోజు భారీ ఎత్తున పైరసీ సీడీలు బయటకు వచ్చాయి. దీంతో పైరసీకి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిత్ర నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా చెన్నైలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.

surya

థియేటర్ కు కేటాయించిన యూనిక్ కోడ్, ఫోరెన్సిక్ వాటర్ మార్కింగ్ ద్వారా...బెంగుళూరులోని పీవీఆర్ ఓరియన్ మాల్ లో సినిమా విడుదల రోజైన మే 6న 9.45 గంటలషోను పైరసీ దారులు రికార్డు చేసినట్లు గుర్తించినట్లు రాజా తెలిపారు.

శుక్రవారం సాయంత్రం నుండే నిరాహార దీక్ష ప్రారంభించినట్లు జ్ఞాన్ వేల్ రాజా ప్రకటించారు. పైరసీని పరిశ్రమ సీరియస్ గా తీసుకోవాలని, పరిశ్రమ పెద్దలు స్పందించి సరైన చర్యలు తీసుకునే వరకు తన దీక్ష కొనసాగుతుందని తెలిపారు.

ఈ మధ్య సౌత్ సినీ పరిశ్రమల్లో పైరసీ తీవ్రరూపం దాల్చింది. సినిమా విడుదలైన రోజే సీడీలు మార్కెట్లోకి వస్తున్నాయి. కొన్ని సినిమాలు విడుదల కాక ముందే ఎడిటింగ్ రూమ్ నుండి బయటకు లీక్ అవుతున్నాయి. దీంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

English summary
Suriya-starrer Tamil time-travel thriller 24 is the latest film to get caught up in the web of piracy. A week after its release in cinemas, it has been found that the movie was pirated on the first day of its release in Bengaluru.Producer Gnanavel Raja has announced indefinite hunger strike until the industry doesn’t come together and take stern measures against piracy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X