For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  "బతుకమ్మ ఫిల్మోత్సవ్" లో రెండవ రోజు: రెండు కళలని బతికించిన సినిమాలు

  |

  త సంవత్సరంలాగానే ఈ యేడాది కూడా "బతుకమ్మ ఫిల్మోత్సవం" రవీంద్రభారతి సమావేశమందిరంలో నిన్నటి నుంచి ప్రారంభించారు. మొదటి రోజు తెలంగాణ రాష్ట్రం గర్వించ దగ్గ తెలంగాణ దర్శక దిగ్గజం శ్రీ బి.నర్సింగ్‌రావు గారి దర్శకత్వంలో' రూపొందిన "మట్టిమనుషులు చిత్రం" ప్రదర్శన చేయగా రెండవరోజైన 4 తేదీన యువ దర్శకుడు అక్షర కుమార్ తీసిన "కాకి పడిగెల కథ (డాక్యుమెంటరీ)" మరియు శ్రీ శివ.ఐ దర్శకత్వంలో రూపొందిన "సాధనాశూరులు (డాక్యుమెంటరీ)" లను ప్రదర్శించారు. తెలుగులో డాక్యుమెంటరీ ఫిలిం చాలా తక్కువ. ఒకరకంగా రాబోయే తరాలకోసం భిన్న కోణాల్లో రకరకాల విషయాలని ఒక చిత్రగ్రంథంగా రూపొందించే డాక్యుమెంటరీలు ఇతర భాషల్లో ఎక్కువగానే ఉన్నా తెలుగులో ఇంకా ఎన్నో అంశాల పైన రావాల్సిన అవసరం ఉండగా ఇప్పుడు తెలంగాణా భాషా, సాంస్కృతిక శాఖ ఆ కార్యక్రమాన్ని ముందునడిపించే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

  అందులో భాగంగా రూపొందినవే... కాకి పడిగెల కథ, సధనా శూరులు అనే ఈ రెండు డాక్యుమెంటరీలు. ఈ చిత్రాలను రూపొందించిన యువకులిద్దరూ పెద్ద ఆస్థులున్న కుటుంబాలనుంచి వచ్చిన వారు కాదు, ఆర్థికంగానూ, సామాజికంగానూ మరీ ఉన్నత స్థాయిలోని వారేం కాదు కానీ వారి అద్బుత ప్రతిభ ఈ డాక్యుమెంటరీ తీయటానికి వారు ఆయా మనుషులతో కలిసిపోయిన తీరూ. చిత్రీకరణ పై వారికున్న ఆసక్తిని, ఇష్టాన్నీ చూపిస్తున్నాయి. నిజానికి ఈ సారి జరిగే బతుకమ్మ ఫిల్మోత్సవ్ ని మిస్సయ్యారంటే ఒక అద్బుతమైన అనుభూతినీ, మరో అత్యద్బుతమైన రోజునీ కోల్పోయినట్టే

  2nd Day of Batkamma filmotsav at Ravindra bharati

  శివ.ఐ రూపొందించిన"సాధనా శూరుల డాక్యుమెంతరీ నేపథ్యం సాధనా శూరులనే ఒక జాతి వారి జీవన విధానం. వీరు కరీంనగర జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో నివసిస్తారు.క్రీ.శ. 234 సం. లోవీరి పూర్వీకులు కృష్ణ గంధర్వ రాజు ఆకృత్యాలను సహించలేక కాళికాదేవి దీక్షతో కొన్ని అదృశ్య శక్తులు మరియు ఇంద్రజాల శక్తులను పొంది రాజుని సంహరించారు. అందుకు వీరు సాధనాశూరులుగా పిలువబడ్డారు అనేది వీరి చరిత్ర. కొన్ని తరాలుగా కళకు జీవం పోస్తూ, వీరు జీవనం కొనసాగిస్తున్నారు కాల క్రమేణా వీరికి సరైన ఆధరణ లేక కళనే నమ్ముకొని జీవించలేక ఆ కళ అంతరించిపోయే దశలో ఉంది.

  వీరు గ్రామాల్లో ప్రదర్శనలను చేస్తూ ప్రజలిచ్చే విరాళాలతో జీవనం కొనసాగిస్తున్నారు. ఇంక కొన్నాళ్ళకి సాధనా శూరుల కళ అంతరించి పొవచ్చు.కానీ ఇప్పుడు శివ తీసిన డాక్యుమెంటరీ ఆ కళాకారులనీ, సాధనాశూరుల కళనీ శాశ్వతం చేసింది. ఈ డాక్యుమెంటరీ ని తొలిసారిగా తీసిన శివ ఐ ఆ కళాకారుల కళనీ తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో బయటకు తీసుకువచ్చాడు.

  ఇక అక్షర కుమార్ తీసిన "కాకి పడిగెల కథ డాక్యుమెంటరీ" ముదిరాజుల మిరాశి కులం కాకిప‌డిగెల‌. వీరు ఎక్కువగా క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, న‌ల్ల‌గొండ జిల్లాల్లో నివాసముంటారు. వారికి వార‌స‌త్వంగా వ‌స్తున్న ఈ క‌ళారూపం కాకిపడిగెల కథతోనే వీరి బ‌తుకు వెళ్లదీస్తున్నారు. ప‌ట‌మేసి పాండ‌వుల క‌థ చెప్పే సంప్ర‌దాయం వీరిది. చెట్టుకొక‌రు పుట్ట‌కొక‌రుగా ఉన్న ఈ కుల‌స్తుల కుటుంబాలు ఓటి ఒరుగల్లులో ఉంటే మ‌రోటి సిద్ధిపేట ప‌రిస‌ర గ్రామాల్లో ఉంది. వంద‌ల యేండ్లుగా కాకిప‌డిగెలు క‌థ చెప్పుకుంటూ బ‌తుకీడుస్తున్నారు.

  2nd Day of Batkamma filmotsav at Ravindra bharati

  ఇలాంటి వారి గురించి ఆలోచించిన అక్ష‌ర‌ కుమర్ ఎడ‌తెగ‌ని మ‌మ‌కారంతో, వారి క‌ళ ప‌ట్ల ఉన్న గౌర‌వంతో, వారి కళారూపాన్ని, వారి కళ చ‌రిత్ర‌ను బ‌తికించాల‌నే తండ్లాటతో రూపొందించాడు ఈ కాకిపడిగెల కథ. ఓ అంత‌రిస్తున్న క‌ళ గురించి, క‌ళాకారుల గురించి ఈ యువ ద‌ర్శ‌కుడు మ‌ధ‌నపడింది ఏంటో.. ఈ యువ‌ద‌ర్శ‌కుని ప్ర‌తిభ ఇందులో అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. క‌నుమ‌రుగ‌వుతున్న క‌ళారూపానికి క‌న్నీటి భాష్యం, కాకిప‌డిగెల స‌జీవ దృశ్య‌కావ్యం. తానకి ఒక ప్రాంతం మీదా, ఆ జాతి జనుల మీదా, కళల మీదా తీవ్రమైన ప్రేమ ఉంటే తప్ప ఇలా తెరకెక్కించటం జరగదు. "క‌ళ బ‌త‌కాలంటే...ముందు క‌ళాకారుడు బ‌త‌కాలి".

  కార్యక్రమంలో ప్రముఖ హాస్య నటుడు కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన తాగుబోతు రమేశ్,, దర్శకులు సాగర్ చంద్ర ( అయ్యారే, అప్పట్లో ఒకడు ఉండేవాడు చిత్రం తీస్తున్నారు), కందికొండ తెలుగు సినిమా పాటల రచయిత, , డా. పసునూరి రవీందర్ - కేంద్ర యువ సాహితీవేత్త పురస్కార గ్రహీత) సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ, తెలంగాణ సినీ నటుడు రోషన్ బాలు, ఈ కార్యక్రమ సమన్వయకర్త నాగులూరి నరేందర్, అక్షర కుమార్, సంఘీర్, శివ.ఐ, ఈ కార్యక్రమంలో పలువురు సినిమా అభిమానులు, ప్రేమికులు, యువ దర్శకులు, తదితరులు పాల్గొన్నారు.

  2nd Day of Batkamma filmotsav at Ravindra bharati

  ఈ రోజు ప్రదర్శనలూ, కార్యక్రమాల వివరాలు

  1) రవీంద్రభారతి, పైడి జయరాజ్ సమావేశమందిరంలో (మొదటి అంతస్తులో) "ఫిల్మోత్సవం -2" లో భాగంగా శ్రీ అజిత్ నాగ్ దర్శకత్వంలో రూపొందిన "బొమ్మలోల్లు" మరియు శ్రీ కె వి ఆర్ మహేంద్ర దర్శకత్వంలో తీసిన "ఒగ్గుచుక్క" డాక్యుమెంటరీల ప్రదర్శన ఉంటుంది.

  2) రవీంధ్రభారతి, ప్రధాన వేధికలో ఉదయం 10గంIIలకు "కొత్తపేట జిల్లాపరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు" ప్రదర్శన ఉంటుంది.

  English summary
  Batukamma Filmotsav will be Held from October 3rd to 7th says telangana cultural dipartment Director Mamidi Harikrishna
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X