twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    30 ఏళ్ల క్రితం..... రామోజీని కలిసేందుకు ఆర్జీవి కిల్లింగ్ ఐడియా

    వర్మ 30 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రామోజీని కలిసేందుకు చేసిన ప్రయత్నాన్ని గుర్తు చేసుకున్నారు.సినిమా అవకాశం కోసం వర్మ ఆయన్ను అప్పట్లో కలిశారట.రామోజీ పత్రికకు రాసిన ఆర్టికల్‌న

    By Bojja Kumar
    |

    దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ తాజాగా ఫేస్ బుక్‌లో చేసిన ఓ పోస్టు హాట్ టాపిక్ అయింది. 30 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఆయన అప్పట్లో సినిమా నిర్మాతగా మంచి ఊపులో ఉన్న రామోజీరావును కలిసేందుకు ప్రయత్నించారట.

    అయిప్పట్లో వర్మ ఉన్న స్థాయికి రామోజీరావు అపాయింట్మెంట్ దొరకడమే కష్టం అయిందట. రామోజీ దృష్టిలో పడేందుకు 'ది ఐడియాస్‌ కిల్డ్‌ 50 మిలియన్‌ పీపుల్‌' పేరిట ఓ ఆర్టికల్ రాసి ఆ సమయంలో ఆయన నడిపించిన న్యూస్‌టైం అనే పేపర్‌కు పంపించారు.

    సినిమాల కోసం ప్రయత్నిస్తున్న రోజులవి..

    సినిమాల కోసం ప్రయత్నిస్తున్న రోజులవి..

    ‘అది నేను సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజులు. అదే సమయంలో శ్రీవారికి ప్రేమ లేఖ, మయూరి, ప్రతిఘటన లాంటి అసాధారణమైన హిట్లతో రామోజీరావు గారు దూసుకుపోతున్నారు. వెంటనే ఆయన్ని కలవాలని ప్రయత్నించా. అయితే అంత పెద్ద సెలబ్రిటీని కలవటం అంటే అప్పట్లో మామూలు విషయం కాదు అని వర్మ తెలిపారు.

    ఆయన్ను కలవడం కోసమే

    ఆయన్ను కలవడం కోసమే

    రామోజీ రావును కలవడం కోసం, ఆయన దృష్టిలో పడేందుకు ‘ది ఐడియాస్‌ కిల్డ్‌ 50 మిలియన్‌ పీపుల్‌' పేరిట ఓ ఆర్టికల్ రాసి ఆ సమయంలో ఆయన నడిపించిన న్యూస్‌టైం అనే పేపర్‌కు పంపించా. నా ఆర్టికల్‌ ప్రచురితమై నా పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత నాకు ఆయన అపాయింట్ మెంట్‌ దొరికింది.... అని వర్మ వెల్లడించారు.

    అవకాశం ఇవ్వని రామోజీ

    అవకాశం ఇవ్వని రామోజీ

    అయితే రామోజీని కలిసి వర్మకు సినిమా అవకాశం రాలేదు. అందుకు కారణం వర్మకు అనుభవం లేక పోవడమే. వర్మ ఆయన్ను ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా.... రామోజీరావు కన్విన్స్ కాలేదట. సినిమా అవకాశం కాదు కానీ...తన పేపర్లో కాలమిస్ట్‌గా నాకు అవకాశం ఇస్తానని చెప్పారట రామోజీరావు.

    చాలా కాలం తర్వాత...

    చాలా కాలం తర్వాత...

    తాను అప్పట్లో రాసిన ఆ వ్యాసం తనకు ఎంతో గుర్తింపు తెచ్చిందని, తన కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషించారని ఆర్జీవీ చెప్పాడు. చాలా కాలంగా మిస్సయిన ఆ ఆర్టికల్ మళ్లీ స్నేహితుడి దగ్గర దొరకడంతో.... దాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు వర్మ.

    English summary
    "This is an article I wrote some 30 years back for Ramoji Rao's Newstime paper in the hope of getting an appointment with him to ask for a break as a director because at that time he had come up with some unconventional hits like “Srivariki Premalekha”, “Mayuri” and “Pratighatana”. So I thought my best chances were with him but the problem was to get access to him. So I came up with a this Idea and wrote an article titled “The Ideas that killed 50 million people” for his then newspaper called “Newstime”. It got published and then I identified myself to him as the writer of that article and got my appointment with him." RGV said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X