»   » బాహుబలి లో తన పాత్రగురించి చెప్పేసాడు..... రాజమౌళి కండిషన్లని దాటి మరీ..!?

బాహుబలి లో తన పాత్రగురించి చెప్పేసాడు..... రాజమౌళి కండిషన్లని దాటి మరీ..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి 2 లో నటించే ఏ నటుడూ కూడా సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.రాజమౌళి ఎవరినీ ఏవివరాలనూ బత్యట పెట్టనివ్వలేదు కూడా... కానీ, పృథ్వీ మాత్రం డేర్ చేసి బాహుబలి లో తన పాత్ర ఏమిటో చెప్పేసాడు. తాను కూడా సినిమాలో నటిస్తున్నానని, దేవసేన అనుష్కకు మంత్రిగా కనిపిస్తానని చెప్పాడు. రాజమౌళి తనకూ ఓ మంచి పాత్రను ఇచ్చాడని తెలిపాడు.

ఇప్పటిదాకా కామెడీ పాత్రల్లోనే నటించిన తాను.. బాహుబలి-2 సినిమాలో తొలిసారిగా సీరియస్ పాత్రలో కనిపిస్తున్నానని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాలన్నింటిలో పృథ్వీ తప్పనిసరిగా ఉంటున్నాడు. 30 ఇయర్స్ పృథ్వీ గా తెలుగువాళ్ళలో పాపులర్ అయిన పృథ్వీ ప్రస్తుతం తెలుగులో టాప్ కమెడియన్ అని చాలా మంది అభిప్రాయం. మరి అలాంటి పృథ్వీ బాహుబలి సినిమాలో స్థానం సంపాదించకుండా ఉంటాడా. ఆ అవకాశం పృథ్వీ కి వచ్చిందని ఇదివరకే వార్తలు వచ్చాయి. మరి పృథ్వీ బాహుబలి- 2 లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నాడు?


30 years prudhvi in baahubali 2

ఇప్పటికేన్ ఒకసారి బాహుబలి స్పూఫ్ లో హీరోగా కనిపించిన పృథ్వీ ఈసారి మాత్రం నిజంగా నే బాహుబలిలో తానెలా కనిపించ బోతున్నాడో ముందే చెప్పేసాడు. రోల్ చిన్నదే గానీ తనకి చాలా నచ్చిందని, బాహుబలి లో నటించే అవకాశం రావడం తన అదృష్టం గా భావిస్తున్నానని అంటున్నాడు. ఇప్పటికే బాహుబలి లో నటించిన వారందరూ ఇండియా వైడ్ ఫేమస్ అయ్యారు.


బాహుబలి 2 రిలీజ్ అయితే పృథ్వీ కూడా బిజీ అయిపోతాడు. థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ. పేరుకు త‌గ్గ‌ట్లే చాలా సంవత్సరాల స్ట్ర‌గుల్ తర్వాతే ఇండస్ట్రీలో ఇప్ప‌టికి గుర్తింపు వ‌చ్చింది. ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్ పేజీలో ప్రతి ఈవెంట్ గురించి పోస్ట్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్నామధ్య చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాలో తన పాత్రను కట్ చేసి బాధించారంటూ తన ఫేస్‌బుక్‌లోనే పోస్ట్ చేసి తన ఆవేదనను వెలిబుచ్చాడు.


30 years prudhvi in baahubali 2

తన సీన్లను తీసేస్తే.. పండుగ రోజు అమ్మ చనిపోయినంత బాధ అనిపించిందని ఆవేదన చెందాడు. టాలీవుడ్ లో ఇప్పుడు పూర్తి ఫామ్ లో ఉన్న క‌మెడియన్ 30 ఇయ‌ర్స్ పృథ్వీ. స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్లు కూడా ఇప్పుడు పృథ్వీ కోసం ప్ర‌త్యేక పాత్ర‌లు డిజైన్ చేస్తున్నారు. ఇక ఈ బాహుబలి కూడా వచ్చేస్తే పృథ్వీ కేవలం కమేడియన్ గానే కాకుండా సీరియస్ క్యారెక్టర్లలో కూడా కనిపిస్తాడనే అనుకుంటున్నారు...

English summary
Generally, Filmmakers get frustrated when comedians spoof their films. However, Rajamouli appreciated ‘30 years Prudhvi’ for spoofing Baahubali and gave him a role in ‘Baahubali2’ it is heard and Prudhvi shared about his character in Bahubali 2
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu