»   » చూడండి :ధాంక్స్ చెప్తూ రకుల్ ప్రీతి సింగ్.. "వీడియో" వదిలింది

చూడండి :ధాంక్స్ చెప్తూ రకుల్ ప్రీతి సింగ్.. "వీడియో" వదిలింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఫేస్‌బుక్‌ ఖాతాను లైక్‌ చేసిన అభిమానుల సంఖ్య 40లక్షలకు చేరింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలిపారు. తనపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపించిన అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

Thank you so much for your love and support!!


Posted by Rakul Preet on25 September 2015

ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ తాజా చిత్రం బ్రూస్ లీ ది ఫైటర్ షూటింగ్ లో పాల్గొంటోంది. మెగా మీటర్ సాంగ్ లో ఆమె మాస్ బీట్ కు చేసి అలిసి పోయానంటూ చెప్తోంది.


Shooting for a lovely set song #megameter in #BruceLeeTheFighter ..Long working hours, tired body but it's d massy beats dt boost r energy


Posted by Rakul Preet on26 September 2015

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డి.వి.వి. దానయ్య నిర్మాత. ఎస్‌.ఎస్‌. థమన్‌ సంగీతం సమకూర్చారు. అక్టోబర్‌ 2న 'బ్రూస్‌లీ' గీతాలను విడుదల చేయనున్న విషయం తెలిసిందే.


రామ్‌చరణ్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బ్రూస్‌లీ'. 'ది ఫైటర్‌' అనేది ఉపశీర్షిక. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. చిరంజీవి ఓ కీలక పాత్రలో సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో నృత్య దర్శకుడు శేఖర్‌ నేతృత్వంలో ఓ పాట తెరకెక్కిస్తున్నారు. మెగా మీటర్‌... అంటూ సాగే ఆ పాటలో చరణ్‌, రకుల్‌ ఆడిపాడుతున్నారు. త్వరలో చిరంజీవి కూడా చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు.


4 million Facebook Likes for Rakul Preet Singh

నిర్మాత మాట్లాడుతూ ''బ్రూస్‌లీకి వీరాభిమాని అయిన ఓ యువకుడి కథ ఇది. తనకు ఎదురైన ఓ సమస్యపై ఎలా పోరాటం చేశాడన్నది తెరపైనే చూడాలి. వినోదం, కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేస్తూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. రామ్‌చరణ్‌ చేసే యాక్షన్‌, డ్యాన్సులు అభిమానుల్ని అలరించేలా ఉంటాయి.


ఇటీవల విడుదలైన 'లే చలో...' పాటకి మంచి స్పందన లభిస్తోంది. పాటల్ని వచ్చే నెల 2న, చిత్రాన్ని 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు. కథ: కోన వెంకట్‌, గోపిమోహన్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌ కృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వి.వై.ప్రవీణ్‌కుమార్‌, సమర్పణ: డి.పార్వతి


మరో ప్రక్క ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో...'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను వినాయిక చవితి సందర్బంగా ఎన్టీఆర్‌ తన సోషల్ నెట్ వర్కింగ్ ఖాతా ద్వారా విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రం హీరోయిన్ రకుల్ ప్రీతి సైతం ఈ ఫస్ట్ లుక్ కు ఫిదా అయిపోయి ట్వీట్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

English summary
Rakul Preet official facebook page has got 4 million preferences further more her twitter record came to 1 Lakh supporters which is an uncommon deed by an up and coming youthful champion like her. These numbers showcases her developing prevalence in south film industry alongside bollywood.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu