»   » ‘లెజెండ్’ సినిమా నుండి ఆ 4 సీన్లు కట్ చేసిన ఈసీ

‘లెజెండ్’ సినిమా నుండి ఆ 4 సీన్లు కట్ చేసిన ఈసీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'లెజెండ్' సినిమాను ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపి వేయాలా? లేదా? అనే విషయమై పరిశీలన జరిపిన ఎన్నికల సంఘం ఎట్టకేలకు శుక్రవారం ఓ నిర్ణయం తీసుకుంది. ఈ చిత్రాన్ని నిలిపి వేయాల్సిన అవసరం లేదని, సినిమాలో అభ్యంతర కరంగా ఉన్న కొన్ని పొలిటికల్ డైలాగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిర్మాతను అభ్యంతరకరంగా ఉన్న 4 సీన్లు తొలగించాలని నిర్మాతను ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల బన్వర్ లాల్ తెలిపారు.

సినిమాను నిలిపివేస్తే నష్టాల పాలవుతామని భావించిన నిర్మాతలు....ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు. లెజెండ్ సినిమాలో రాజకీయ డైలాగులు ఉన్నాయని, అందువల్ల ఎన్నికలు అయ్యే వరకు సినిమాను నిలపేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సంఘాన్ని కోరిన సంగతి తెలిసిందే.

4 Scenes to be Removed From Legend Movie

లెజెండ్ సినిమాలో కొన్ని సన్నివేశాలు, డైలాగులు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని, అందువల్ల ఎన్నికలు అయ్యే వరకు లెజెండ్ సినిమాను నిషేధించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన ఎన్నికల సంఘం అధికారులు లెజెండ్ సినిమాను పరిశీలించారు. అనంతరం సినిమాపై ఓ నివేదికను తయారు చేసి ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్‌కు అందజేయనున్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకుడు అయిన నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి రానున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ, సీమాంధ్రల్లో నామినేషన్ ఘట్టం కూడా పూర్తయింది. తెలంగాణలో ఏప్రిల్ 30న, సీమాంధ్రలో మే 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ సినిమాను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసిని కోరింది.

English summary
Chief Electoral Officer of Andhra Pradesh Bhanwar Lal said that, 4 Scenes to be Removed From Legend Movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu