»   » గాయనిపై 42 మంది మత ప్రవక్తల ఫత్వా.. అలా అయితే చచ్చిపోతా.. నహీద్

గాయనిపై 42 మంది మత ప్రవక్తల ఫత్వా.. అలా అయితే చచ్చిపోతా.. నహీద్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంగీత కచేరిల్లో అద్భుతంగా రాణిస్తున్న గాయని నహీద్ ఆఫ్రీన్‌ (16)పై మత ప్రవక్తలు కన్నెర్ర చేశారు. బహిరంగ ప్రదేశాల్లో వేదికలపై పాటలు పాడకూడదని ఆంక్షలు విధిస్తూ అఫ్రీన్‌పై దాదాపు 42 మంది మత ప్రవక్తలు ఫత్వా జారీచేశారు. నహీద్ ఆఫ్రీన్ 2015 ఇండియన్ ఐడల్ జూనియర్ పోటీల్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

25న అసోంలో సంగీత కచేరీ

25న అసోంలో సంగీత కచేరీ

అసోంలోని హోజయ్ జిల్లా లంక పట్టణంలోని ఉదిలిత్ మైదానంలో మార్చి 25న సంగీత కచేరి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నహీద్ పాల్గొంటున్నారు. ఈ సంగీత కచేరీ వేదిక మసీదుకు, శ్మశానానికి చేరువగా ఉండటం వల్ల ఈ కార్యక్రమ నిర్వహణపై ప్రవక్తలు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది.

నహీద్‌పై ఆంక్షలు జారీ

నహీద్‌పై ఆంక్షలు జారీ

సంగీత కచేరీ కార్యక్రమంలో పాల్గొనవద్దని నహీద్‌ను హెచ్చరించారు. దాంతో యువ గాయని ఒక్కసారిగా షాక్ గురైంది. తొలుత ఫత్వా వార్త విని షాక్ గురయ్యాను. భోరమని ఏడ్చాను. నాకు స్ఫూర్తిగా నిలిచిన గాయకులు మ్యూజిక్‌ను వదులుకోవద్దని చెప్పారు. ఏది ఏమైనా మ్యూజిక్‌ను వదులుకొనే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేసింది.

మ్యూజిక్ దేవుడు ఇచ్చిన వరం

మ్యూజిక్ దేవుడు ఇచ్చిన వరం

మ్యూజిక్ నాకు దేవుడు ఇచ్చిన గొప్పవరం. దానిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకొంటాను. దేవుడి కృపను తిరస్కరించడం సమంజసం కాదు. సంగీతమే నా జీవితం. అది లేకుండా బతుకలేను. పాటలు పాడటానికి అల్లా నాకు మంచి గొంతును ఇచ్చాడు అని నహీదా మీడియాతో అన్నారు. ఒకవేళ పాడటం ఆపివేస్తే నేను చచ్చిపోవడం ఖాయం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అసోం సీఎం భరోసా.. భద్రత

అసోం సీఎం భరోసా.. భద్రత

‘అసోం ముఖ్యమంత్రి సర్బనందా సోనోవాల్ నాతో మాట్లాడారు. ఫత్వాలకు భయపడవద్దని చెప్పారు. వేదిక వద్ద భారీ భద్రతను కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు' అని నహీదా వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో కళాకారులకు స్వేచ్ఛ ఉండాలి. నహీద్‌తో మాట్లాడా. ప్రభుత్వం ఆమెకు అన్ని రకాల భద్రతను కల్పిస్తుంది అని అసోం సీఎం సోనోవాల్ ట్వీట్ చేశారు.

అఖీరా చిత్రంతో బాలీవుడ్‌లోకి

అఖీరా చిత్రంతో బాలీవుడ్‌లోకి

2015 ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో నహీద్ ఆఫ్రీన్ దుమ్ము రేపింది. సంగీత దిగ్గజాల ప్రశంసలు అందుకొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. 2016లో సోనాక్షి సిన్హా నటించిన అఖీరా చిత్రంతో బాలీవుడ్‌లోకి నహీద్ ప్రవేశించింది.

English summary
As many as 42 clerics have issued a fatwa against reality singing star Nahid Afrin, who was the first runner-up of a musical reality TV show Indian Idol Junior, asking her to stop performing in public.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu