»   » రూల్స్ అర్దం చేసుకోకండా ‘దంగల్‌’ ధియోటర్ లో వృధ్దుడుపై దాడి,కేసు

రూల్స్ అర్దం చేసుకోకండా ‘దంగల్‌’ ధియోటర్ లో వృధ్దుడుపై దాడి,కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై:సినిమా థియేటర్లలోనైనా, మరెక్కడైనా జాతీయ గీతం వినబడితే లేచి నిలబడాలని రీసెంట్ గా రూల్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ రూల్ లోనూ వృద్ధులు, వికలాంగులకు మినహాయింపు ఉంది. కానీ జనం దాన్ని అర్థం చేసుకోవడం లేకపోవటంతో సమస్యలు వస్తున్నాయి. ధియోటర్ లో గొడవలు అవుతున్నాయి. ఈ నేఫధ్యంలో బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ నటించిన 'దంగల్‌' చిత్రం ప్రదర్శిస్తుండగా ఓ వృద్ధుడిపై దాడి జరిగటం చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే...ముంబయి శివారు ప్రాంతమైన గోరెగావ్‌లోని ఓ థియేటర్‌లో దంగల్‌ సినిమా ఆడుతోంది. సినిమా చూడ్డానికి వచ్చిన వారిలో వృద్ధుడైన అమల్‌రాజ్‌ దాసన్‌ ఒకరు. దంగల్‌ సినిమాలోని ఓ సీన్ లో మహావీర్‌ ఫొగట్‌(ఆమిర్‌ఖాన్‌) కూతురు స్వర్ణ పతకం సాధించిన సమయంలో జాతీయగీతం వచ్చే సన్నివేశం ఉంటుంది. ఆ సమయంలో థియేటర్‌లో ఉన్న వారందరూ నిలబడి జాతీయ గీతం ఆలపిస్తున్నారు.


కానీ 59ఏళ్ల దాసన్‌ లేచి నిలబడకపోవడంతో హాల్‌లో ఉన్న ఓ వ్యక్తి ఒక్కసారిగా దాసన్‌పై దాడికి దిగి చెంపచెళ్లుమనిపించాడు. దీనిపై ఇతరులు ఫిర్యాదు చేయగా విచారించిన పోలీస్‌లు దాడి చేసిన వ్యక్తి శిరీష్‌ మధుకర్‌గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ఐపీసీ సెక్షన్‌ 323, 504 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.


59-year-old assaulted for not standing up during Dangal’s National Anthem scene

ఇదిలా ఉంటే...దంగల్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. హర్యాన్వీ రెజ్లర్ మహవీర్ సింగ్ పోగట్ బయోపిక్ దంగల్ సూపర్‌హిట్ టాక్‌తో కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.350కోట్లు క్లబ్‌లోకి చేరిన మొదటి ఇండియన్ సినిమాగా దంగల్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.


తాజాగా దంగల్ రూ.376.14కోట్లు వసూళ్లతో దూసుకుపోతుంది. డిసెంబర్ 23న విడుదలైన దంగల్ రూ.376.14కోట్ల కలెక్షన్లతో, హిస్టారికల్ సక్సెస్‌తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈ మూవీలో అమీర్‌కు జోడీగా సాక్షి తన్వర్ నటించింది.

English summary
A 59-year-old man was allegedly assaulted in a movie theatre in Mumbai for not standing up when the National Anthem tune was played on screen during a scene in the movie Dangal, the police said on Monday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu