»   » మెగా హీరో మెగా డీల్...ఒకే నిర్మాతతో 6 సినిమాలు!

మెగా హీరో మెగా డీల్...ఒకే నిర్మాతతో 6 సినిమాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి మేనమామ వారసత్వం పునికి పుచ్చుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యువ హీరో సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, తిక్క, శతమానం భవతి. సాయి ధరమ్ తేజ్ చేసిన, చేస్తున్న ఈ సినిమాలన్నింటికీ నిర్మాత దిల్ రాజే కావడం గమనార్హం. మెగా మేనల్లుడు వరుసగా ఐదు సినిమాలు ఒకే నిర్మాతతో చేయడం వెనక కారణం ఏమిటి అనేది హాట్ టాపిక్ అయింది.

దీనిపై ఆ మధ్య సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ... ‘దిల్ రాజుగారు నా వద్దకు మంచి స్క్రిప్టుతో వచ్చారు. మంచి రెమ్యూనరేషన్ ఆఫర్ చేసారు. ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంటుంది' అంటూ సమాధానం ఇచ్చారు. ఇపుడు దిల్ రాజుగారు నాతో చేసినట్లే గతంలో మెగాస్టార్ గారు కూడా క్రాంతి కుమార్ గారితో సినిమాలు చేసారు' అని సాయి ధరమ్ తేజ్ చెబుతున్నాడు.


6 Films deal: Dil Raju give huge package to Sai Dharam Tej

గతంలో క్రాంతి కుమార్ చిరంజీవితో ఐదు సినిమాలు చేసారు కానీ ఆ సినిమాలన్నీ వరుసగా చేయలేదు. కానీ దిల్ రాజు సాయి ధరమ్ తేజ్‌తో వరుసగా ఐదు సినిమాలు కమిట్ అయ్యారు. ఈ కమిట్మెంటు వెనక స్రీకెట్ ఏమిటో తెలిసిపోయింది. దిల్ రాజు-సాయి ధరమ్ తేజ్ మధ్య వరుసగా 6 సినిమాల డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. గతంలో అల్లు అరవింద్ హీరోయిన్ తమన్నాతో 3 సినిమాలు, నిర్మాత గణేష్ హీరోయిన్ కాజల్ తో 3 సినిమాలు డీల్ కుదుర్చుకున్నట్లే ఇపుడు సాయి ధరమ్ తేజ్ తో దిల్ రాజు 6 సినిమాల డీల్ కుదుర్చుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.


ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రం ఈ నెల 24న విడుదలకు సిద్దమవుతోంది.

English summary
Some say that, Dil Raju has give a huge package to Sai Dharam Tej and promised him 6 films with 6 different scripts and directors.
Please Wait while comments are loading...