»   » 6 నిమిషాల సీన్: ‘అత్తారింటికి దారేది’ దీపావళి గిఫ్ట్

6 నిమిషాల సీన్: ‘అత్తారింటికి దారేది’ దీపావళి గిఫ్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అత్తారింటికి దారేది' చిత్రం భారీ విజయం సాధించి తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించడంతో పాటు, రూ. 100 కోట్లు వసూలు చేసే దిశగా సాగుతున్న సంగతి తెలిసిందే.

కాగా...సినిమాలో కొన్ని అదనపు సీన్లు కలుపుతున్నట్లు ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ వియాషన్ని ప్రొడక్షన్ టీం అఫీషియల్‌గా ప్రకటించింది. అదనంగా 6 నిమిషాల నిడివిగల సీన్లు కలుపుతున్నట్లు వెల్లడించారు. అభిమానులకు దీపావళి కానుకగా ఈ సీన్ కలిపినట్లు చెబుతున్న నిర్మాతలు.....అక్టోబర్ 31 నుంచి సినిమాలో ఆ అదనపు సీన్లు కనిపిస్తాయని తెలిపారు.

పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Pawan Kalyan’s ‘Atharintiki Daaredhi’ production team has officially announced that 6 minutes of extra footage is being added to the film. The new footage will be available in theatres from October 31st, as a Diwali gift.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu