twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి ఆఫర్ ఇవ్వలేదు: వెంకటేష్ (ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రతి ఏడాది సౌత్ లో ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సారి కూడా చెన్నైలో ఈ వేడుక నిర్వహించనున్నారు. జూన్ 28న చెన్నైలోని ఇండోర్ స్టేడింయలో జరిగే 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో జరిగింది.

    ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డు కమిటీ ప్రతినిధి జితేష్ పిళ్లై, ఈ అవార్డుల కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న బ్రిటానియా కంపెనీ తరుపున ఆ సంస్థ ప్రతినిధి అలీ హెరాత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డల కోసం పోటీ పడుతున్న చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించారు.

    ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ....అవార్డు అనేది ప్రతి నటుడికి ఉత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇప్పటి వరకు ఐదు ఫిలింఫేర్ అవార్డులు గెలచుకున్నాను. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే దర్శకులు సృజనాత్మకతతో ఆలోచిస్తూ కొత్త కథల్ని సిద్ధం చేస్తున్నారు. మున్ముందు మన సినిమాకు మంచి రోజులు రాబోతున్నాయి అన్నారు.

    నేను ఎప్పుడూ కొత్త దనాన్ని ప్రోత్సహిస్తుంటాను. ఆ ఉద్దేశ్యంతోనే నా ఇమేజ్ పక్కనపెట్టి దృశ్యం సినిమాలో ఇద్దరు పిల్లల తండ్రిగా నటించాను అన్నారు వెంకటేస్. బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ...సగటు ప్రేక్షకుడిగా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. రాజమౌళి ఆఫర్ ఇచ్చి ఉంటే ఈ సినిమాలో నటించే వాడిని అని ఓ సమాధానం ఇచ్చారు. ప్రయోగాత్మక క్యారెక్టర్లు చేయడానికి తాను ఎప్పటికీ సిద్దమే అన్నారు. వ్యక్తిగత కారణాలతో ఆరు నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్నానని చెప్పిన వెంకీ జులై, ఆగస్టుల్లో రెండు సినిమాలను అనౌన్స్ చేస్తానని తెలిపారు.

    తెలుగు నుండి ఫిల్మ్ ఫేర్ అవార్డులకు పోటీ పడుతున్న సినిమాలు, నటుల వివరాలు స్లైడ్ షోలో..

    ఉత్తమ చిత్రం

    ఉత్తమ చిత్రం

    దృశ్యం
    కార్తికేయ
    మనం
    రేసుగుర్రం
    రన్ రాజా రన్

    బెస్ట్ డైరెక్టర్

    బెస్ట్ డైరెక్టర్

    చందూ మొండేటి-కార్తికేయ
    శ్రీప్రియ - దృశ్యం
    సుజీత్ - రన్ రాజా రన్
    సురేందర్ రెడ్డి - రేసు గుర్రం
    విక్రమ్ కుమార్ -మనం

    ఉత్తమ నటుడు

    ఉత్తమ నటుడు

    అల్లు అర్జున్ - రేసుగుర్రం
    మోహన్ బాబు- రౌడీ
    నాగార్జున - మనం
    శర్వానంద్ - రన్ రాజా రన్
    వెంకటేష్ - దృశ్యం

    ఉత్తమ నటి

    ఉత్తమ నటి

    కాజల్ - గోవిందుడు అందరి వాడేలే
    పూజా హెడ్గే - ఒక లైలా కోసం
    రకుల్ ప్రీత్ సింగ్ - లౌక్యం
    సమంత - మనం
    శృతి హాసన్- రేసు గుర్రం

    English summary
    The mania of Filmfare Awards South 2015 has started with the press conference held on Wednesday, 3 July. Telugu superstar Venkatesh has embarked the beginning of the most-awaited award function at the press conference.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X