twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాద్‌షా' ఎఫెక్ట్: ఒకేసారి భాక్సాఫీస్ కు 7 పరీక్షలు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్ 'బాద్‌షా' ఈ నెల 5న విడుదలైంది. స్టార్ హీరోల చిత్రాలు వచ్చినప్పుడు ఎక్కువ సినిమాలు విడుదల కావు. ఎందుకంటే స్టార్‌ సినిమాకే ఎక్కువ థియేటర్లు దొరుకుతాయి కాబట్టి. దాంతో పెద్ద చిత్రాలు 26వ తేదీ వరకూ రావనే ఉద్దేశంతో ఈ వారం ఎక్కువ చిత్రాల్ని తెరపైకి తెచ్చేందుకు నిర్మాతలు, పంపిణీదారులు సన్నాహాలు చేశారు.

    దానికి తోడు శ్రీరామనవమి ఈ శుక్రవారం వచ్చింది... ఆ సెలవుని కూడా సద్వినియోగం చేసుకొనేలా విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేసుకొన్నారు. ఈ శుక్రవారం ఆరు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఎన్నో ఆశలతో ...భాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వచ్చే వారం నుంచి మళ్లీ పెద్ద చిత్రాల హడావిడి మొదలవుతున్నందున ఈ శుక్రవారం ఎక్కువ సంఖ్యలో చిత్రాలు ప్రేక్షకుల తీర్పు కోరేందుకు వస్తున్నాయి.

    నితిన్‌, సిద్ధార్థ్‌, శిరీష్‌ల చిత్రాలతోపాటు మరో మూడు బరిలో నిలిచాయి. వాటితోపాటూ చిన్నవాటికీ స్థానం ఉంది. పెద్ద చిత్రాల విడుదలల మధ్య వచ్చిన విరామాన్ని చిన్న చిత్రాల నిర్మాతలూ సద్వినియోగం చేసుకొనేందుకు సన్నాహాలు చేసుకొన్నారు. ముఖ్యంగా 'గుండె జారి...', 'గౌరవం', 'ఎన్‌.హెచ్‌.4'లను ఎక్కువ థియేటర్లలో విడుదల చేసేందుకు సదరు చిత్రాల నిర్మాతలు ఏర్పాట్లు చేసుకొన్నారు.

    ఈ వారం విడుదల అవుతున్న చిత్రాల వివరాలు... స్లైడ్ షో లో...

     'గుండె జారి గల్లంతయ్యిందే'

    'ఇష్క్‌'తో ఫామ్‌లోకి వచ్చిన హీరో నితిన్‌. ఆ చిత్రం తరవాత చేసిందే 'గుండె జారి గల్లంతయ్యిందే'. ఇందులో నిత్య మీనన్‌, ఇషా తల్వార్‌ హీరోయిన్స్ . బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఐటం సాంగ్ లో నర్తించింది. ఈ సినిమా నిర్మాత నిఖితారెడ్డి మాట్లాడుతూ ''ఇష్క్‌ తరహాలోనే ఇది కూడా సున్నితమైన ప్రేమ కథ. వినోదానికి పెద్దపీట వేశాం. యువతకు నచ్చేలా తీర్చిదిద్దాం. ఇలాంటి చిత్రాలకు వేసవి సరైన సీజన్‌'' అన్నారు.

     'ఎన్‌.హెచ్‌.4'

    తమిళం నుంచి డబ్బింగ్ అవుతున్న చిత్రం 'ఎన్‌.హెచ్‌.4'. బెంగళూరు - చెన్నై జాతీయ రహదారిపై జరిగే సంఘటనలతో అల్లుకొన్న ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్‌. ఇప్పటి వరకూ తాను చేసిన చిత్రాలకు భిన్నమైనదనీ, ఉత్కంఠ రేకెత్తించే అంశాలతో ఈ సినిమా ఉంటుందనీ ఆయన చెబుతున్నారు.

    'గౌరవం'

    కులపరమైన సమస్యల చుట్టూ అల్లుకొన్న కథే 'గౌరవం'. కుటుంబ బంధాలు, పరువు ప్రతిష్ఠలకు సంబంధించిన అంశాలను ఇందులో ప్రస్తావించారు. నటుడు ప్రకాష్‌రాజ్‌ నిర్మించిన ఈ సినిమా ద్వారా నిర్మాత అల్లు అరవింద్‌ కుమారుడు శిరీష్‌ హీరోగా పరిచయమవుతున్నారు. 'నువ్విలా' ఫేమ్‌ యామి గౌతమ్‌ హీరోయిన్ .

    ఎన్‌.ఆర్‌.ఐ

    ఎరీస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘ఎన్‌.ఆర్‌.ఐ'. ‘నవ్‌ రిటర్న్‌ టు ఇండియా' అనేది ఉపశీర్షిక. రోహిత్‌ కాలియా-మిధున హీరో,హీరోయిన్స్ . ఎన్నారై రఘునందన్‌ గూడూర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

    'ఒసే ఒసే వదిలేసి వెళ్లిపోకే'

    తమిళంలో విజయవంతమైన చిత్రాన్ని ‘ఒసే ఒసే వదిలేసి వెళ్లిపోకే..' పేరిట తెలుగులో అందరికీ నచ్చే విధంగా అనువాదం చేసి విడుదల చేస్తున్నామని చిత్ర నిర్మాత నల్లపు రవీంద్రబాబు తెలిపారు. ఈ చిత్రంలో నటించిన 73 మంది ఆర్టిస్టులను నటుడు కమల్‌హాసన్ ఎంపిక చేశారని ఆయన తెలిపారు. ఎస్1 టీమ్ పిక్చర్స్ పతాకంపై వెంకటేష్, అక్షర జంటగా, షణ్ముఖ రాజ్ దర్శకత్వంలో నిర్మించారు.

    'చిన్న సినిమా'

    అర్జున్ కళ్యాణ్, సుమోనా చందా, వెనె్నల కిషోర్, తాగుబోతు రమేష్ ప్రధానపాత్రధారులుగా జెర్సీ ఫ్లాట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘చిన్న సినిమా' (అన్ లిమిటెడ్ బడ్జెట్). ఎ.కె.కంభంపాటి దర్శకత్వంలో శేఖర్, జ్యోతి నిర్మిస్తున్నారు. అమెరికా పిచ్చోడు, సినిమా అవకాశాలకోసం వెతికేవాడు, గీత వెంటపడే గోపీ, ముసలోళ్ల లోకాభిరామాయణం, సినీ పరిశ్రమను ఏలేద్దామనే వచ్చేవాళ్లు మంజరి అనే డాన్సర్ వీరందరి కథతో ఈ చిత్రం రూపొందిందింది.

    'మిస్టర్‌ రాజేష్‌'

    రహమత్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఆకాష్‌ 7 పాత్రలు పోషిస్తూ దర్శకత్వంతోపాటు పలు శాఖలు కూడా నిర్వహిస్తూ ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌‌స'తోపాటు ప్రతిష్టాత్మక గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌‌సలో స్థానం సంపాదించుకోనున్న చిత్రం ‘మిస్టర్‌ రాజేష్‌'.

    English summary
    A power pact Friday for the Telugu fans as there are 7 releases this weekend. From 'Gunde Jaari Gallanthayyinde' to 'Mr Rajesh' the list of films are both interesting and fun.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X