»   » రాంచరణ్ పై అంత బడ్జెట్టా... సుకుమార్ కాన్ఫిడెన్స్ ఏమిటి..?

రాంచరణ్ పై అంత బడ్జెట్టా... సుకుమార్ కాన్ఫిడెన్స్ ఏమిటి..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం ఖచ్చితంగా హిట్ అవసరం ఏ హీరోకైనా ఉందీ అంటే రాం చరణ్ అనే చెప్పొచ్చు. మిగతా హీరోలంతా 50 కోట్లు, 100 కోట్లు అంటూ కలక్షన్స్ టార్గెట్స్ పెట్టుకుంటుంటే చెర్రి మాత్రం కనీసం తన సినిమాలు హిట్ అయితే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నాడు.

పోయిన సంవత్సరం లో వచ్చిన బ్రూస్ లీ లో మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చినా ఆ బూస్టింగ్ కూడా రాం చరణ్ సినిమాని గట్టిక్కించలేక పోయింది. ప్రస్తుతం తమిళ సినిమా తనిఒరువన్ రీమేక్ అయిన "ధృవ" లో నటిస్తున్న చరణ్ ఈ సినిమా తర్వాత సుకుమార్ తో ఇంకొక సినిమా కి సైన్ చేశాడు.

చెర్రి కోసం ఒ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ కథతో రాబోతున్నాడట సుకుమార్. నాన్నకు ప్రేమతో తో ఒక బంపర్ హిట్ ని ఖాతాలో వేసుకొని మాంచి ఊపులో ఉన్న సుక్కు.. రాం చరణ్ కి కూడా ఒక హిట్ ఇచ్చేస్తాను అన్నంత కాంఫిడెంట్ గా ఉన్నాడట. అంతేకాదు సినిమా బడ్జెట్ కూడా 70 కోట్ల దాకా ఉంటుందని అంచనా.

70 Cr budget for Charan, Sukumar’s movie

మరి వరుస ఫ్లాపుల్లో ఉన్న చెర్రి మీద అంత బడ్జెట్ ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు సేఫ్ అన్నది కాస్త ఆలోచించల్సిన విశయమే. అయితే ఇప్పుడు చేస్తున్న దృవ కూడా మంచి సబ్జెక్టే కావటం తో హిట్ అయ్యే చాన్స్ లే ఎక్కువగా ఉన్నాయి.

ఇక సుకుమార్ 14 రీల్స్ తో కలిసి మహేష్ బాబు తో తీసిన "1 నేనొక్కడినే" కూడా భారీ బడ్జెట్ తో రూపొందించబడింది. ఆ సినిమా ఫలితం గురించి అందరికి తెలిసిందే. ఆ దెబ్బతో 14 రీల్స్ బ్యానర్ పరిస్థితే తల్లకిందులయ్యింది. .

మరి ఇప్పుడు చరణ్ తో సుక్కు తీస్తున్న సినిమా బడ్జెట్ తగ్గించుకోవటం మంచిదేమో లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. త్వరలో వెల్లడించే వివరాలతో ఈ సినిమాపై ఓ పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పట్లోగా బడ్జెట్, మిగతా స్టార్ కాస్ట్ గురించి కూడా పూర్తి వివరాలు తెలుస్తాయి.

English summary
sukumar planning a heavy budget movie with ramcharan, is this a good idea..?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu