»   »  కనీవినీ ఎరుగని రీతిలో అఖిల్ ఎంట్రీ....

కనీవినీ ఎరుగని రీతిలో అఖిల్ ఎంట్రీ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని కుటుంబం నుండి వస్తున్న మరో వారసుడు అఖిల్. ఎఎన్ఆర్ మనవడిగా, నాగార్జున తనయుడిగా తెరంగ్రేటం చేయబోతున్న అఖిల్ గతంలో ఏ సినీ వారసుడికి లేనంత ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. తొలి సినిమా వివి వినాయక్ లాంటి టాప్ డైరెక్టర్ తో చేయడంతో పాటు, భారీ బడ్జెట్ సినిమా ద్వారా మాస్, యాక్షన్ హీరోగా లాంచ్ అవుతున్నాడు.

అఖిల్ కు ఇది తొలి సినిమానే అయినప్పటికీ నిర్మాణంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఈ సినిమా కోసం ఏకంగా 8 సెట్లు వేసారట. దూకుడు, మిర్చి, శ్రీమంతుడు చిత్రాలకు పని చేసిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో భారీ సెట్టింగ్స్ వేసారు. ఇందులో కొన్ని సెట్స్ పాటల చిత్రీకరణ కోసం, మరికొన్ని సెట్లు హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాల కోసం ఉపయోగించినట్లు తెలుస్తోంది. తెరంగ్రేటం చేస్తున్నహీరో తొలి సినిమాకు ఇంత బడ్జెట్ ఖర్చు చేయడం, ఇన్ని సెట్లు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అక్కినేని ఫ్యామిలీ నుండి గతంలో చాలా మంది హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే వారెవ్వరికి అఖిల్ రేంజిలో హైప్ రాలేదు. గతంలో నాగ చైతన్య పరిచయం అయిన సమయంలో కూడా ఇంత హైప్ లేదు. కానీ అఖిల్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా విషయంలో మాత్రం క్రేజ్ భారీగా ఉంది.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండటం, స్వయంగా యంగ్ హీరో నితిన్ ఈచిత్రాన్ని నిర్మిస్తుండటం కూడా సినిమాపై హైప్ పెరగడానికి మరో కారణం. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత అంచనాలు మరింత పెరిగాయి.

 8 Sets for ‘Akhil’ movie!

మరో వైపు ‘అఖిల్' సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వివిధ ఏరియాల్లో కలిపి మొత్తం రూ. 45 కోట్లకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. ఎంటైర్ ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ రూ. 17 కోట్లకు, నైజాం ఏరియాలో రూ. 14 కోట్లకు, సీడెడ్ ఏరియాలో 6 కోట్లకు... టోటల్ రూ. 37 కోట్లకు అమ్ముడయినట్లు సమాచారం.

దీంతో పాటు కర్ణాటకలో రూ. 4 కోట్లకు, రెస్టాఫ్ ఇండియా రూ. 50 లక్షల నుండి 1 వరకు అమ్ముడు పోయిందని అంటున్నారు. ఇక ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం రూ. 3.5 కోట్ల నుండి 4 కోట్లకు అమ్మడయినట్లు చెబుతున్నారు. ఇక శాటిలైట్స్ రైట్స్ రూ. 7 నుండి 8 కోట్లకు తక్కువ కాకుండా వస్తాయని ఆశిస్తున్నారు. ఇలా ఓవరాల్ గా ఈ చిత్రం రూ. 53 కోట్లకు చేరింది. తెరంగ్రేటం చేస్తున్న హీరో సినిమాకు ఈ రేంజిలో బిజినెస్ జరుగడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

53 కోట్లకు చేరింది. తెరంగ్రేటం చేస్తున్న హీరో సినిమాకు ఈ రేంజిలో బిజినెస్ జరుగడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. అసలు ఇంత వరకు అక్కినేని ఫ్యామిలీలో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ చేసిన సినిమా ‘మనం'. ఈ చిత్రం 40 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఈ రికార్డును కూడా అఖిల్ అక్కినేని బద్దలు కొట్టడం గమనార్హం. మరి సినిమా విడుదలకు ముందే పరిస్థితి ఇలా ఉందంటే... అఖిల్ సినిమా విడుదల తర్వాత ఎలా ఉంటుందో.

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇటీవల అ‘అఖిల్' మూవీ టీజర్ విడుదల చేశారు. యూట్యూబ్‌లో ఒక్కరోజులోనే ఈ టీజర్ 5 లక్షల వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. ఈ మేరకు నితిన్ చాలా ఆనందంగా ఉన్నాడు. దసరా సందర్భంగా సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
The latest and interesting detail about Akhil film is that the makers have erected total 8 sets for this high-budget flick without compromising. Akhil might be a newcomer, but it's not quite easy to shoot with him in the outdoor locales and hence director Vinayak wanted to erected 8 sets for the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu