For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘అ..ఆ’ పవన్ వల్లే, సమంత కూడా హీరో, కాపీ వివాదంపై త్రివిక్రమ్ వివరణ (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన చిత్రం 'అఆ'. జూన్ 2న విడుదలైన ఈ సినిమా అనుకున్నదానికంటే ఎక్కువే సక్సెస్ అయింది. సినిమా చూసిన వారంతా ఇది నితిన్ సినిమ కాదు, సమంత సినిమా అనే అభిప్రాయం వ్యక్తం చేసారు. అదే విధంగా సినిమాపై ఓ చిన్న వివాదం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనరాణి రాసిన నవల నుండి ఈ సినిమా లైన్, కొన్ని క్యారెక్టర్లు తీసుకున్నారు. కనీసం ఆమెకు థాంక్స్ కార్డు కూడా వేయలేదంటూ విమర్శలు వచ్చాయి.

  వీటన్నింటికీ శనివారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ సందర్భంగా వివరణ ఇచ్చారు దర్శకుడు త్రివిక్రమ్. ఆయన మైక్ పట్టుకోవడంతోనే తొలుత వివాదంపై స్పందించారు. 'ఈ సినిమా మేం ఊహించిన దానికంటే పెద్ద హిట్టయ్యింది. 9 నెలలు క్రితం ఈ సినిమాలోని కొన్ని క్యారెక్టర్స్ గురించి యద్దనపూడి సులోచనారాణిగారితో మాట్లాడాను. ఆమె సలహాలను కొన్నింటిని తీసుకోవడం జరిగింది. ఆమె పేరును థాంక్స్ లిస్టులో వేసినా చిన్న పోరపాటు వల్ల అది యాడ్ కాలేదు. మళ్లీ దాన్ని చేర్చడానికి మాకు 48 గంటల సమయం పట్టింది. ఇది అనుకోకుండా జరిగిందే...అంతకు మించి మరేమీ లేదు' అన్నారు.

  సమంత కారణంగానే...

  'ఈ సినిమా చేయడానికి కారణం సమంత. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రీకరణ సమయంలో సమంత ఓసారి మీరు మెదడుతోనే ఆలోచిస్తున్నారు. హృదయంతో ఎందుకు ఆలోచించరు అని అనింది. ఆ ప్రభావం నాపై చూపిందనుకుంటాను' అని త్రివిక్రమ్ చెప్పారు.

  స్లైడ్ షోలో త్రివిక్రమ్ చెప్పిన మరిన్ని వివరాలు, సక్సెస్ మీట్ ఫోటోస్...

  అప్పుడే చేయాల్సింది...

  అప్పుడే చేయాల్సింది...

  ‘నితిన్ తో సన్నాఫ్ సత్యమూర్తి కంటే ముందుగానే సినిమా చేయాల్సింది కానీ కథ చెప్పాలనుకున్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడని శరత్ మరార్ గారిని అడిగితే నితిన్ స్పెయిన్ లో ఉన్నాడు. ఆయన వచ్చేలోపే సన్నాఫ్ సత్యమూర్తి సంబంధించిన డిస్క్రషన్స్, స్క్రిప్టు వర్క్ పూర్తవడంతో ఆ సినిమాతో బిజీ అయిపోయాను.' అన్నారు త్రివిక్రమ్.

  పవన్ గుర్తు చేసారు. మాట ఇస్తే నిలబెట్టుకుంటాను

  పవన్ గుర్తు చేసారు. మాట ఇస్తే నిలబెట్టుకుంటాను

  ‘సాధారణంగా నేను మాట ఇవ్వను. ఇస్తే వీలైనంత వరకు దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. నితిన్ తో సినిమా చేస్తానని మాటిచ్చాను.

  సన్నాఫ్ సత్యమూర్తి కాగానే ఓ రోజు పవన్ కల్యాణ్ గారు నెక్ట్స్ మూవీ ఏం చేస్తారని అడిగారు. అలాగే ఆయనే మీరు నితిన్ ఓ సినిమా చేస్తానని అనుకున్నారు అని కూడా ఆయన గుర్తు చేయడంతో నితిన్ తో ఈ సినిమా చేయడానికి రెడీ అయిపోయాను' అన్నారు.

  ఇద్దరు హీరోల సినిమా...

  ఇద్దరు హీరోల సినిమా...

  ‘అ..ఆ ఇద్దరు హీరోల సినిమా అంటూ త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్య చేసారు. సమంత థెరి, 24, బ్రహ్మోత్సవం వంటి పెద్ద సినిమాలు చేసినా ఈ సినిమా కోసం చాలా డేట్స్ ఇచ్చింది, చాలా సపోర్ట్ చేసింది. నేను 8 సినిమాలు చేశాను. అయితే తనవంటి హీరోయిన్ ను చూడలేదు. ఈ సినిమాను ఇద్దరు హీరోల సినిమాగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే వారిద్దరే సెట్లో తిరుగుతుంటారు(నవ్వుతూ). సమంతగారు ఒక టైంలో అడిగారు... ఏంటి నేను లేకుంటే మీరు సీన్లే పెట్టుకోరా, ఫైట్లు అవీ పెట్టుండి...నేను లేకుండా సినిమా తీయండమ్మా అన్నారు. నేను వెంటనే ఒక రోలింగ్ టైటిల్ తప్ప సినిమా మొత్తం మీరు ఉన్నారు అని చెప్పాను' అన్నారు.

  నితిన్ గురించి....

  నితిన్ గురించి....

  నితిన్ నేను ఎంత సింక్ లో ఉన్నామంటే...క్లైమాక్స్ లో కింద కూర్చుని సమంతతో మాట్లాడే సీన్ షూట్ చేసాం. ఎందకనో రాత్రంతా ఒకటే ఆలోచన. ఆ సీన్ బాగా రాలేదని అనిపించింది. ఉదయం నేను, నితిన్, కెమెరామెన్ నట్టి ఆ సీన్ మళ్లీ షూట్ చేద్దామా? అని ఒకేసారి అన్నాం. ఆ సీన్ ఇంకోసారి చేద్దామా అని నేను అడగటంతో నితిన్ నేను కూడా అదే చెబుదామనుకుంటున్నాను అన్నారు. నట్టి కూడా నేను అదే అభిప్రాయం వ్యక్తం చేసారు. మేమంతా ఒకేలా ఆలోచించాం కాబట్టే ఆ షాట్ అంత బాగా వచ్చింది అన్నారు.

  బాగా చేసారు.

  బాగా చేసారు.

  ‘సీనియర్ నటులైన నరేష్, రావురమేష్ లు ఎంతో సపోర్ట్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, హరితేజ, ప్రవీణ్ ల కామెడి సినిమాను మరో లెవల్ లో కూర్చొని పెట్టింది' అన్నారు.

  టెక్నీషియలన్స్ గురించి...సినిమాటోగ్రాఫర్ నటరాజ్

  టెక్నీషియలన్స్ గురించి...సినిమాటోగ్రాఫర్ నటరాజ్

  సుబ్రమణియన్, మిక్కి ఇలా అందరూ బలమైన వ్యక్తితం ఉన్న వ్యక్తులు వల్లే ఈ సినిమా బాగా రూపొందింది. అలాగే కథ చెప్పిన వెంటనే సపోర్ట్ చేసిన నిర్మాత రాధాకృష్ణగారు, ఏం చెప్పినా చేయడానికి ముందుకు వచ్చిన వంశీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పి.డి.ప్రసాద్ గారికి థాంక్స్'' అన్నారు.

  English summary
  Trivikram comments about Nitin and Samantha at A.. Aa Success Meet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X