»   » వీడియో: ఆకలిగా ఉంది.. బిచ్చగాడితో షారుక్.. కంటతడి..

వీడియో: ఆకలిగా ఉంది.. బిచ్చగాడితో షారుక్.. కంటతడి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ పరిశ్రమలో చాలా మంది సూపర్‌స్టార్లు గాలిలో తేలుతుంటారు. అలాంటి నటులకు భిన్నంగా పలువురికి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ స్ఫూర్తిగా నిలిచాడు. ముంబైలో షారుక్ ఖాన్ ఎదురైన సంఘటనే అందుకు ఉదాహరణ.

 తెల్లవారే దాక హోటల్‌లోనే బాద్షా

తెల్లవారే దాక హోటల్‌లోనే బాద్షా

తన తదుపరి చిత్రం గురించి చర్చించేందుకు ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌తో షారుక్ ముంబైలోని హోటల్‌లో సమావేశమయ్యాడు. కథా చర్చలు ముగిసే సమయానికి దాదాపు తెల్లవారే సమయమైంది. డైరెక్టర్, షారుక్ చర్చలు ముగించి ఇంటికి వెళ్లేందుకు బయటకు వచ్చారు.

షారుక్ ఖాన్ ఎదురుపడ్డ బిచ్చగాడు..

షారుక్ ఖాన్ ఎదురుపడ్డ బిచ్చగాడు..

రెస్టారెంట్ బయటకు వచ్చి షారుక్ తన కారు వైపుకు నడిచి వెళ్తుండగా సడన్‌గా వాహనం వద్దకు ఓ బిచ్చగాడు వచ్చి కలిశాడు. నిన్ను చూడటానికి రాత్రంతా ఇక్కడే వేచి ఉన్నాను. షారుక్ భాయ్ ఆకలిగా ఉంది.. భోజనం పెట్టించండి అని షారుక్‌ను బిచ్చగాడు దీనంగా వేడుకొన్నాడు.

చలించాడు.. కంటతడి పెట్టుకొన్నాడు..

చలించాడు.. కంటతడి పెట్టుకొన్నాడు..

దాంతో షారుక్ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. చలించిన షారుక్ అతడితో కాసేపు ఆప్యాయంగా మాట్లాడాడు. ఆ తర్వాత తన అనుచరులకు ఆ బిచ్చగాడిని అప్పగించి భోజన ఏర్పాట్లు చేయాలని సూచించాడు. షారుక్ ఖాన్ బాడీగార్డ్ రవి వెంటనే స్పందించి ఆ పేదవాడికి ఆహారాన్ని సమకూర్చాడని అక్కడే ఉన్న ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు.

షారుక్ తీరుపై అనూహ్య స్పందన

షారుక్ తీరుపై అనూహ్య స్పందన

షారుక్ స్పందించిన తీరుపై పలువురు ప్రశంసిస్తున్నారు. బిచ్చగాడితో షారుక్ మాట్లాడుతున్న సమయంలో ఓ మీడియా ప్రతినిధి షూట్ చేసి యూట్యూబ్‌లో ఉంచాడు. ప్రస్తుతం ఆ వీడియోకు అనూహ్య స్పందన వస్తున్నది. సోషల్ మీడియాలోనూ షారుక్‌ను అభినందిస్తున్నారు.

English summary
Shah Rukh Khan is known to be one of Bollywood's most humble, kind-hearted stars. Recently, Shah Rukh Khan gave yet another example of how large-hearted he is. He arranged food for beggar in midnight at mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu