»   » పవర్ స్టార్ చూసారు: నిఖిల్ కల నెరవేరింది

పవర్ స్టార్ చూసారు: నిఖిల్ కల నెరవేరింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘శంకరాభరణం' సినిమా ఫస్ట్ లుక్ టీజర్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదలైన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ చేతుల మీదుగా తన సినిమాకు సంబంధించిన ఏదైనా కార్యక్రమం జరుగాలనేది నా డ్రీమ్. ఆది ఇప్పుడు నిజం అయింది అంటూ నిఖిల్ సోషల్ మీడియా ద్వారా ఆనందం వెలుబుచ్చారు.

A Dream Come True.. POWER STAR watching SHANKARABHARANAM 1st look Teaser. This pic sums it all up.. Fantastic Day which...


Posted by Actor Nikhil on Wednesday, October 14, 2015

‘‘స్వామిరారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య'' చిత్రాలతో తనకంటూ విభిన్నమైన శైలిని ఏర్పాటు చేసుకుని దూసుకుపోతున్న నిఖిల్ రచయిత కోనవెంకట్ నిర్మాణంలో ‘శంకరాభరణం' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఉద‌య్ నంద‌న‌వ‌నం ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.


A Dream Come True.. POWER STAR watching SHANKARABHARANAM

బీహార్ నేపథ్యంలో సాగే మరో సరికొత్త క్రైం కామెడీ సినిమా ఇది. ఈ సినిమాకు ‘శంకరాభరణం' అనే టైటిల్ పెట్టిన రోజునుంచే అంతటా మంచి ఆసక్తి రేకెత్తింది. తెలుగులో స్టార్ రైటర్‌గా వెలుగొందుతున్న కోన వెంకట్ ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరించడంతో సెట్స్‌పైకి వెళ్ళకముందే ఈ కాంబినేషన్‌పై అంచనాలు ఏర్పడ్డాయి.


క్రైమ్ కామెడీ క‌థ‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన నందిత‌ను హీరోయిన్‌. అతిధి పాత్రలో హీరోయిన్ అంజలి నటిస్తోంది. అంజలికి ‘గీతాంజలి' చిత్రంతో కోన మంచి విజయాన్ని అందించారు. ఆ మేరకే అంజలి ‘శంకరాభరణం' చిత్రంలో గెస్ట్ రోల్ వేయడానికి సిద్థపడిందని సమాచారం.


English summary
"A Dream Come True.. POWER STAR watching SHANKARABHARANAM 1st look Teaser. This pic sums it all up.. Fantastic Day which ended with a Hug frm the Power Himself.. privileged" Nikhil said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu