»   » మహేష్ బాబుకు హీరోయిన్‌కు లవ్ లెటర్ రాసిన ఫ్యాన్

మహేష్ బాబుకు హీరోయిన్‌కు లవ్ లెటర్ రాసిన ఫ్యాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోలు, హీరోయిన్లకు అభిమానులు ఉండటం సహజమే. అయితే అభిమానుల్లో వీరాభిమానులుంటారు. అందులో మళ్లీ వారిని పిచ్చి పిచ్చిగా ప్రేమించి ఫ్యాన్స్ వ్యవహార శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. అనుక్షణం వారి ఆలోచనలతోనే గడుపుతుంటారు. వారిని కలవడానికి ఆరాట పడుతుంటారు. అప్పడప్పుడు లవ్ లెటర్స్ రాస్తుంటారు.

తాజాగా మహేష్ బాబు ‘1-నేనొక్కడినే' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన క్రితి సానన్ కు ఓ అభిమాని లవ్ లెటర్ రాసాడు. దీన్ని ఆమె తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా షేర్ చేసింది. సదరు ఫ్యాన్ ఆమెపై ఎంతలా ప్రేమ పెంచుకున్నారో ఆ లెటర్ చూస్తే స్పష్టమవుతుంది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

A fan’s Love Letter to Kriti Sanon

క్రితి సానన్ సినిమాల విషయానికొస్తే....మోడలింగ్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న క్రితి సానన్ తొలి సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘1-నేనొక్కడినే' దక్కించుకుంది. అయితే ఈ సినిమా ప్లాపు కావడంతో అమ్ముడుకి పెద్దగా పేరు రాలేదు. హిందీలో టైగర్ ష్రాఫ్ సరసన హీరోపంతి సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ప్లాప్ అయింది. ఈ పరిస్థితులు ఆమెకు అవకాశాలు రాకుండా చేసాయి.

ప్రస్తుతం క్రితి సానన్ నాగ చైతన్య సరసన సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘దోచెయ్' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాను మార్చి 20వ తేదిన విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ తరహా జోనర్ లో చైతన్య సినిమా చేయడం ఇదే తొలిసారి. వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

English summary
Amazing things are done by fans, as Mahesh Babu’s “1-Nenokkadine” heroine Kriti Sanon gets stunned by a love letter written by her fan named Simran. Call this letter as so sweet and lovable, she shared it with her other fans.
Please Wait while comments are loading...